ఒక‌ప్పుడు క్రేజీ అండ్ ట్రెండీ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాధ్. హీరో హీరోయిన్లు మాట్లాడుకునే వ‌ర్ష‌న్ వాళ్ళ ల‌వ్ సీన్స్‌ని కొత్త‌గా ట్రెండీగా సెట్ చెయ్య‌డ‌మంటే పూరి త‌ర్వాతే ఎవ‌రైనా స‌రే. పూరి స్టైల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, అనుష్క‌, మాస్‌మ‌హారాజా ర‌వితేజ వీళ్ళంద‌రికీ మంచి బ్రేక్‌ ఇచ్చిన డైరెక్ట‌ర్ పూరి అని చెప్పాలి. అయితే పూరి ముందు ఇండ‌స్ట్రీలోకి హీరో అవుదామ‌ని అడుగుపెట్టార‌ట‌. అయితే ఆయ‌న ఆ దిశ‌గానే అడుగులు వేశార‌ట‌. రామ్‌గోపాల్ వ‌ర్మ తీసిన శివ చిత్రంలో హిందీలో నాగార్జున ప‌క్క‌నే విల‌న్స్ బ్యాచ్‌లో పూరి క‌నిపిస్తారు. ఇక ఆ చిత్రంతో ఆయ‌న మ‌రింత ఇంప్ర‌స్ అయి ఎలాగైనా స‌రే యాక్ట‌ర్ అవ్వాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశారు. 

 

అయితే ఓసారి అది చూసి వ‌ర్మ‌తో ఆయ‌న డిస్క‌స్ చేస్తే వ‌ర్మ నువు యాక్ట‌ర్‌గా కంటే డైరెక్ట‌ర్‌గా బాగా సెట్ అవుతావు. డైరెక్ట‌ర్ అవ్వ‌మ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చార‌ట‌. దాంతో ఆయ‌న అలా క‌థ‌లు రాయ‌డం మొద‌లు పెట్టి డైరెక్ట‌ర్ అయ్యారు. ఇక ఆయ‌న‌కున్న ఆ ఇన్‌టెన్ష‌తోనే ఎక్కువ‌గా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల్లో ఏదో ఒక ఫ్రేమ్‌లో అయినా స‌రే ఆయ‌న క‌నిపిస్తూ ఉంటారు. అలాగే ప్ర‌తి హీరోని త‌న ఎమోష‌న్స్‌ని చూపిస్తూ త‌న‌లా ఊహించుకుని వాళ్ళ‌ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు పూరి. ఇక ఆయ‌న‌కుంటే యార‌గెంట్ మొత్తం హీరోలో చూపిస్తాడు పూరి. ఇక ఆయ‌న ఓ సారి చెప్పిన మీడియా స‌మావేశంలో ఆయ‌న‌లోని న‌టుడిని, ద‌ర్శ‌కుడిని ఎక్కువ‌గా తొక్కేసింది కేవ‌లం ఆ ఒక్క‌డే అన్నాడు. అది ఎవ‌రో కాదు ఆయ‌న‌లోని రైట‌ర్‌.

 

ఆయ‌న క‌థ‌లు చాలా బాగా రాస్తారు. దాంతో ఆయ‌న‌లోని డైరెక్ట‌ర్‌, న‌టుడిని ఇద్ద‌రినీ డామినేట్ చేసేది రైట‌ర్ మాత్ర‌మే అంటున్నాడు పూరి. ఇక పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రాల‌న్నీ కూడా ఆయ‌నే క‌థ స్క్రీన్‌ప్లే మొత్తం ఆయ‌న రాసిన‌వే ఉంటాయి. పూరి ఒక క‌థ రాయ‌డం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అనేది చాలా త‌క్కువ కాలంలో అయిపోతుంది. అలాగే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం కూడా చాలా ఫాస్ట్‌గా చేస్తార‌ట‌. అది పెద్ద బ‌డ్జెట్ సినిమా అయినా స‌రే ఎక్కువ టైమ్ తీసుకోర‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: