దాదాపు ఏడాది కి గాని ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ ను చూసే భాగ్యం కలుగలేదు. ఎప్పటినుండో సినిమా పూర్తి టైటిల్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగాఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలు రేపటి తో తీరనున్నాయి ఈ సినిమా టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రేపు తెలుగు తోపాటు తమిళ, మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో విడుదలకానుందని మేకర్స్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. 
 
అయితే కరెక్ట్ గా ఎన్ని గంటలకు విడుదలచేస్తామనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఈవిషయంలో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజామౌళికే క్లారిటీ లేదట. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వల్ల సినిమాకు సంబందించిన సాంకేతిక నిపుణలు అంతా ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్నారట దాంతో ఏ టైంకు విడుదలచేస్తామో  చెప్పలేను కానీ రేపు మాత్రం లోగో తోపాటు మోషన్ పోస్టర్ విడుదలవుతుంది..  థ్రిల్ అవ్వడానికి రెడీ గా ఉండండి అని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 
 
ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం 70 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకోగా తదుపరి షెడ్యూల్ పూణే లో జరుగనుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా వీరికి జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ,బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కనిపించనున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదలకానుంది. ఈచిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: