టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తీసుకుంటున్న సంచలనమైన నిర్ణయాలు, సామాజిక దృక్పదంతో ఆలోచించే విధానం టాలీవుడ్ సెలబ్రిటీస్ తో సహా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేయడానికి అందరికంటే ముందు ఉంటున్నారు నితిన్. ఇప్పుడు ఆయన పెళ్లి విషయమో కూడా నితిన్ తీసుకున్న ఆసక్తికరమైన చూసి అందరూ అభినందిస్తున్నారు. వాస్తవంగా నితిన్ తన పెళ్ళి వేడుకను ఏప్రిల్ 16న ఘనంగా జరపబోతున్నట్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. 

 

కాని కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో దుబాయ్‌లో పెళ్లి వేడుకను ఇరు కుటుంబ సభ్యులు రద్దు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దుబాయ్ వెళ్లే ప్రసక్తే లేదని... హైదరాబాద్‌లో కూడా వివాహ వేడుక నిర్వహించే పరిస్థితి కూడా కనిపించడంలేదమి తెలుస్తుంది.

 

అయితే పెళ్లిని మాత్రం వాయిదా వేసే ఆలోచనలో ఇరు కుటుంబాలు లేరని సమాచారం. కచ్చితంగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ పెళ్ళి వేడుక అమ్మాయి స్వస్థలం నాగర్ కర్నూలును వేదికగా ఎంపిక చేసుకున్నారట. అయితే అక్కడ కూడా కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్‌గా పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

 

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే హంగు ఆర్భాటాలకి పోకుండా నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. పరిస్థితులు చక్కబడిన తర్వాతే హైదరాబాద్‌లో రిసెప్షన్ ని ఏర్పాటు చేయనున్నారట. ఇక ఏప్రిల్ 15 నిశ్చితార్థం, 16న పెళ్లి నిర్వహించడానికి ముహూర్తాలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే నితిన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ అభినందిస్తున్నారట.

 

ఇక కరోనా వైరస్‌ నియంత్రణలో తన వంతు సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సంక్షేమ నిధులకు హీరో నితిన్ రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలను మంగళవారం నితిన్ అందజేశారు. స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు చెక్ ఇచ్చారు. త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేస్తారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: