ప్రపంచం కరోనా వైరస్ తో వణికిపోతోంది. చాలా వరకు ఇతర దేశాల నుండి రాకపోకలు మొత్తమంతా ఆగిపోయాయి. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం 175 దేశాలకు పైగా వ్యాపించి ఉంది. ఇటలీ దేశంలో రెచ్చిపోతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన హెచ్చరికలను చాలా చులకనగా తీసుకోవటంతో...ఎంతో అభివృద్ధి చెందిన ఇటలీ దేశం ప్రస్తుతం శవాలతో కుప్పలుతెప్పలుగా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఇండియాలో ఇటువంటి పరిస్థితి రాకూడదని ముందునుండి ప్రధాని మోడీ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇంటికే పరిమితం చేశారు. దాదాపు ఏప్రిల్ 14 వరకు బయటకు రాకూడదు అంటే దేశాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

ఎవరు బయటకు రాకూడదు….ఎవరికి వారు ఇంటికి పరిమితం అయితే ఈ వైరస్ ని అరికట్టవచ్చు అంటూ మోడీ మన దేశానికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఒక ప్రధాని కాకుండా కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నట్లు మోడీ సందేశం ఇవ్వటం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో పేదవాళ్ల బతుకు అస్తవ్యస్తంగా మారడంతో చాలామంది ప్రముఖులు ప్రభుత్వాలకు విరాళాలు చెల్లిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు సీఈవో సత్య నాదెళ్ల భార్య అనుపమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ కరోనా వైరస్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

 

దీనిపై స్పందించిన యంగ్ హీరో నితిన్ తన వంతుగా ఇరు తెలుగు రాష్ట్రాల సహాయనిధికి 20 లక్షల విరాళం అందించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 10 లక్షలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి 10 ల‌క్ష‌లు విరాళాన్ని నితిన్ ప్ర‌క‌టించారు. ప్రధాని ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌నీ, అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో పాలు పంచుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అవటంతో హీరో నితిన్ ని పవన్ కళ్యాణ్ ఫోన్ లో మెచ్చుకున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: