భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఆర్ఆర్ఆర్ సినిమా గురించే. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ గురించి ఏ చిన్న గాసిప్ వచ్చినా.. ఏ అప్డేట్ వచ్చినా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోవాల్సిందే. అలాంటి గాసిప్ ఒకటి ఈ మధ్య బాగా హల్ చల్ చేసింది. సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త బాగా వైరల్ అయింది.

 

 

దీనిపై సినిమా యూనిట్ నుంచి కానీ, అలియా నుంచి కానీ ఎటువంటి అఫిషియల్ వార్త రాలేదు. కానీ.. నిజమనే వార్తలు వచ్చాయి. చరణ్ పక్కన హీరోయిన్ కోసం రాజమౌళి మళ్లీ వేట మొదలెట్టాడని కూదా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఉగాది సందర్భంగా ఈరోజు ఆర్ఆర్ఆర్ టైటిల్ తో పాటు మోషన్ పిక్చర్ రిలీజ్ చేస్తున్నామని సినిమా యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. దీని గురించి అలియా కూడా ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక చరణ్-అలియాతో షూటింగ్ పక్కాగా జరుగుతుందని కన్ఫర్మ్ అయినట్టే.

 

 

కోవిడ్ 19 వైరస్ ప్రభావానికి అన్ని సినిమాల్లానే ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్అలియా భట్ మధ్య వచ్చే కీలకమైన సీన్లు మరో వారం పదిరోజుల్లో తెరకెక్కిస్తారనగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో అలియా ఆర్ఆర్ఆర్ కు ఇచ్చిన కాల్షీట్స్ బ్రేక్ అయ్యాయని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో పలు హిందీ సినిమాలకు ఇచ్చిన డేట్స్ తో క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఆర్ఆర్ఆర్ నుంచి ఆమె తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అలియా ట్వీట్ తో ఆ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: