తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగులోనే అనుష్కకు భారీ స్టార్ స్టేటస్ ఉంది. కానీ తమిళ్ లో కూడా అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య.. వంటి స్టార్ హీరోల పక్కన ఆమె హీరోయిన్ గా చేసింది. అరుంధతి బాహుబలి సినిమాలతో అక్కడా మంచి పేరు దక్కించుకుంది. ఇప్పుడు అనుష్కకు తమిళ్ లో ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని కోలీవుడ్ సమాచారం.

 

 

వెర్సటైల్ డైరక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 2006లో వట్టైయాడు విలైయాడు అనే మూవీ వచ్చింది. తెలుగులో ఆ సినిమా రాఘవన్ గా డబ్బింగ్ అయింది. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోందని సమాచారం. గౌతమ్ రెడీ చేసిన సీక్వెల్ కాన్సెప్ట్ నచ్చిన కమల్ హాసన్సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో కమల్ కు జోడీగా స్వీటీ అనుష్కను దర్శకుడు ఫైనల్ చేశాడని అంటున్నారు. అనుష్కకు గౌతమ్ ఈ కథ గురించి చెప్పి  ఒప్పించాడని కూడా టాక్ వస్తోంది.

 

 

కమల్ హాసన్ తో సినిమా అంటే అనుష్కకు క్రేజీ ఆఫర్ దక్కినట్టే. ప్రస్తుతం భారతీయుడు2 సినిమా చేస్తున్నాడు కమల్. ఆ షూటింగ్ పూర్తయ్యాక చేయబోయేది సినిమానే అనే వార్త చైన్నై సినీ వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. అనుష్క నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. పది రోజుల క్రితమే సినీ పరిశ్రమ కూడా బంద్ అయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: