త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రదర్శకులు ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు. రచయితగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ అనతి కాలంలోనే మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సినిమాలో విషయం లేకున్నా కేవలం తన మాటలతోనే సినిమాను నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో ఆయన మాటలకి ఎంత క్రేజ్ ఉందో బయట ఫంక్టన్స్ లో ఆయన మాట్లాడే మాటలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ ని అభిమానులు "మాటల మాంత్రికుడు", "గురూజీ" అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

 

రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే' చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కూడా తన ప్రతిభ చూపించిన త్రివిక్రమ్ 'అతడు', అత్తారింటికి దారేది, జల్సా, అ ఆ, అరవింద్ సమేత వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సంక్రాంతి సీజన్లో రిలీజైన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గురూజీ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

 

అల వైకుంఠపురంలో చిత్రంలో పూజాహెగ్డేను చూపించిన విధానం గురించి సోషల్ మీడియాలలో త్రివిక్రమ్ ని విమర్శిస్తున్నారు. ఈ చిత్రంలో పుజాహెగ్డే తొడల మీద ఫోకస్ చేస్తూ ఎక్కువ సీన్స్ తీయడం, ఏకంగా తొడలను చూపిస్తూ ఒక పాట చిత్రీకరించడాన్ని వారు విమర్శించారు. త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకుడు ఇలా చూపించడాన్ని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారంట. 'నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' అని కాకుండా 'నీ తొడలు పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' అని ఉంటే ఇంకా బాగుండేది అని ఛలోక్తులు విసురుతున్నారు. రాబోయే చిత్రాల్లో ఇంకేమి చూపిస్తాడో అంటూ కామెంట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో 'గురూజీ' రాను రాను 'లేకేజీ' గా మారిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందిచిన త్రివిక్రమ్ 'ఒక మధ్య తరగతి అబ్బాయి ధనవంతురాలైన అమ్మాయి కాళ్ళను మాత్రమే ఆరాదిస్తాడని వివరణ ఇచ్చుకున్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్ మునుపటిలా అందరూ ఆదరించే చిత్రాలను తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: