సౌత్ లో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని తెలిసిందే. కోరాల్టాయా శివ డైరక్షన్ లో చిరు 152వ సినిమాగా వస్తున్న ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఇక లేటెస్ట్ గా అమ్మడు కొత్త ఫోటో షూట్ తో సర్ ప్రయిజ్ చేసింది అమ్మడు. అయితే ఈ ఫోటోల్లో కాజల్ హాట్ లుక్స్ తో కనిపిస్తున్నా ఎందుకో అమ్మడితో ముదురు తనం బయటపడ్డదని చెప్పొచ్చు. ముఖానికి మేకప్ బాగా ఎక్కువై చూడటానికి హాట్ హాట్ గా ఉన్నా కొద్దిగా ముదురు అన్న భావన కలుగుతుంది. 

 

ఎప్పుడు క్యూట్ గా అనిపించే ఈ అమ్మడు ఈ ఫోటోల్లో మాత్రం కొద్దిగా తేడాగా కనిపిస్తుంది. అయినా సరే అమ్మడి పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.  ఆల్రెడీ సూపర్ పాపులర్ అయినా కాజల్ ఏం చేసినా అది అదిరిపోతోంది. అందుకే ఇప్పుడు ఈ పిక్స్ కూడా కాజల్ ఫ్యాన్స్ ను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. కాజల్ ఇలాంటి హాట్ లుక్స్ లో చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలతో పాటుగా హీరోయిన్స్ ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతున్నారు. 

 

కాజల్ కూడా ఇప్పుడిప్పుడే ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తుంది. తన లుక్స్ విషయంలో ఎప్పుడు జాగ్రత్త పడే అమ్మడు ఈమధ్య ఎందుకో లుక్స్ అంతగా  బాగా లేకున్నా బయటకు వచ్చేస్తుంది. మొన్నామధ్య ఒక యాడ్ షూట్ లో కూడా కాజల్ ఆంటీ లుక్ లో కనిపించింది. దాదాపుగా చేతిలో ఉన్న సినిమాలు చేసి అమ్మడు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది కాబోలు అందుకే బాడీ షేప్ అవుట్ అవుతున్నా సరే లైట్ తీసుకుంటుందని టాక్. మరి కాజల్ ను చేసుకునే ఆ లక్కీ బాయ్ ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: