కాలం అనంతమైనది ఈ అనంతమైన కాలం ఎవరి లెక్కకు అందదు. అందుకే దీనిని యుగం అని అంటారు. తెలుగు ప్రజలు చాంద్రమాసాన్ని అనుసరిస్తారు కాబట్టి ఉగాది సృష్టి ప్రారంభానికి చిహ్నంగా భావించి అనాది కాలం నుండి ఒక పండుగగా జరుపుకుంటూ అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్న పండుగ ‘ఉగాది’. 


శాలివాహన చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పట్టాభిషేకం జరిగిన రోజును మనం శాలివాహన శకంగా గుర్తిస్తూ ప్రతి ఏడాది వచ్చే ఒకొక్క సంవత్సరానికి ఒకొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటాము. వాస్తవానికి ఈరోజు మనకు మానవ జన్మను ప్రసాధించిన భగవంతుడు కి కృతజ్ఞతలు తెలియచేస్తూ మనసా వాచా మనం భగవంతుడు కు కృతజ్ఞతలు తెలియ చేసుకునే రోజుగా కూడ ఈ ఉగాది ని మనం జరుపుకుంటూ ఉంటాము. 


చంద్రభ్రమణం ఆధారంగా సూర్యుడు చుట్టూ తిరిగే కాలాన్ని ఒక సంవత్సరంగా పరిగణించడం వేదకాలం నుండి అలవాటులో ఉన్న ప్రక్రియ. చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాడ్యమినాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిలో “ఉగ” అంటే నక్షత్ర గమనం. ”ఆది” అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్న అర్థం వస్తుంది. అలా యుగానికి ఆది ‘యుగాది’ అయింది. 


పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలని అంటారు. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈపచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు ఉంటేనే ఆ జీవితానికి అర్థం ఏర్పడుతుంది అన్న భావం ఈ ఉగాది పచ్చడిలో ఉంది. ఈరోజు అందరు ఉదయాన్న తీసుకునే ఉగాది పచ్చడిలో అనేక ఆయుర్వేద ఔషద గుణాలు ఇమిడి ఉన్నాయి. శరీర ఆరోగ్యాన్ని కుదుట పరచడంలో ఈ ఉగాది పచ్చడికి అనేక అర్ధాలు ఉన్నాయి. 


ప్రస్తుతం ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోని ప్రజలు అందరు కరోనా గురించి భయపడుతూ కాలం గడుపుతున్న పరిస్థితులలో ఈరోజు ఉదయించిన ఉగాది ఉషోదయం ప్రజల అందరి జీవితాలను శోభాయమానం చేసి అందరికీ ఆయురారోగ్యాలతో విజయవంతమైన జీవితాన్ని కలిగించాలని ఆ దేవుడు ని ప్రార్ధిస్తూ ఇండియా హెరాల్డ్ ప్రపంచలోని తెలుగు వారందరికీ శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: