మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు అయ్యింది. ఇంకా నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చెయ్యలేదు . అనౌన్స్ చెయ్యడం సంగతి తర్వాత అసలు స్టోరీనే ఫైనల్ చెయ్యలేదు . ఇంకా కథలు వింటూనే ఉన్నాడు. మరి ఆ కథలు కంప్లీట్ అయ్యేదెప్పుడో..? నెక్ట్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

 

మొన్నీమద్య వరకూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుని చూపించిన మహేష్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అసలు ఈ మద్య హీరోలందరూ.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు. అలాంటిది బాబు సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలైనా ఇంకా నెక్ట్స్ సినిమా ఊసే ఎత్తడం లేదు. సరిలేరు నీకెవ్వరు  సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. మహేష్ బాబు ఏకంగా 3 నెలలు షూట్ బ్రేక్ తీసుకున్నాడు.  అందుకే ఇదే మంచి టైమ్ అనుకుని  డైరెక్టర్లు మహేష్ కి కథలు చెప్పడానికి రెడీ అయ్యారు.

 

సరిలేరు నీకెవ్వరు టైమ్ లోనే తను నెక్ట్స్‌ చెయ్యబోయే సినిమా గురించి హింట్ ఇచ్చేశాడు మహేష్ బాబు. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సూపర్ స్టార్ మరో సినిమా చేస్తున్నాడని టాక్ నడిచినా.. ఇంకా ఆ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు మహేష్. అందుకే ఈ గ్యాప్ లో నెక్ట్స్ సినిమా కోసం కథలు వింటున్నాడు మహేష్ బాబు.

 

ఎప్పటినుంచో మహేష్ తో సినిమా కోసం ట్రై చేస్తున్న పరశురామ్ మహేష్ బాబుకు  స్టోరీ వినిపిస్తే.. సెకండాఫ్ లో చేంజెస్ చెయ్యమని చెప్పాడు. మరి  ఈ సినిమా ఎంతవరకూ ప్రోగ్రెస్ అవుతుందో చూడాలి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌ కూడా మహేష్ తో సినిమా చేసే ప్లాన్‌ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల లాంటి యంగ్ డైరెక్టర్స్‌ కూడా లిస్ట్‌ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: