స్టార్ హీరోయిన్ గానే కాదు.. స్టార్ కోడలు. స్టార్ వైఫ్ గా సమంతకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. పెళ్లి తర్వాత సాధారణంగా ఏ హీరోయిన్ కు అయినా అవకాశాలు తగ్గుతాయి కానీ సమంత విషయంలో అది రివర్స్ అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె వరుస సినిమాలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలు చేసిన సామ్ ఈ ఇయర్ జానుతో సర్ ప్రయిజ్ చేసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అమ్మడికి మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే సినిమా కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న సమంత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. 

 

కెరియర్ లో మొదటిసారి నెగటివ్ రోల్ లో నటిస్తున్న సమంత ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మొదటి ఎపిసోడ్ సూపర్ సక్సెస్.. ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ లో సమంత విలన్ గా చేస్తుందట. ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సామ్ తనలోని మరో యాంగిల్ కూడా చూపిస్తుందని తేలుతుంది. ఇక ఇదిలాఉంటే ఈ వెబ్ సీరీస్ తర్వాత సమంత ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేయలేదు. సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉందట సమంత. అదేంటి పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట. 

 

చేస్తే మంచి కథలు చేయాలి.. లేదంటే సైలెంట్ గా ఉండాలని సమంత నిర్ణయించుకుందట. ఫీమేల్ లీడ్ మూవీస్ అది కూడా కచ్చితంగా సినిమాలు వర్క్ అవుట్ అవుతాయనే నమ్మకం ఉంటేనే సినిమాలు చేయాలని అనుకుంటుందట. ఇప్పటికే రెండు మూడు కథలు విన్నా అంతగా నచ్చకపోవడంతో ఆమె చేయనని అన్నదట. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాకు ఓకే చెప్పిన సమంత తెలుగు సినిమాలకు మాత్రం ఆంక్షలు విదిస్తుందట. తెలుగులో ఫ్యాన్ బేస్ తో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా కూడా పాత్రను ఎంచుకోవాలి సమంత. అందుకే ఇక్కడ కథల విషయంలో కొద్దిగా టైం పడుతుందట. చూస్తుంటే సమంత తెలుగులో కొద్దిపాటి గ్యాప్ తీసుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: