లేడీ సూప‌ర్‌స్టార్ అన‌గానే ముందు అంద‌రికి గుర్తువ‌చ్చేది ఎవ‌రు అదేనండి న‌య‌న్‌. మ‌న నయనతార.. ప్రస్తుతం కుర్ర హీరోలను పక్కన పెట్టేసి స్టార్‌ హీరోలతో జ‌త క‌ట్టేస్తోంది. అయితే ఇందులో ఓ లాజిక్‌ ఉంది. అదేమిటంటే... కుర్రహీరోలతో నటించే చిత్రాలకు కాల్‌షీట్స్‌ అధికంగా కేటాయించాల్సి ఉంటుంది. అదే స్టార్‌ హీరోల చిత్రాల్లో అంతగా నటించాల్సిన అవసరం ఉండదు. నయనతార ఆరంభం నుంచే ‘లక్కీ’ అనే చెప్పాలి. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలు విజయ్, అజిత్, సూర్య, శింబు, విశాల్‌ తో జత కట్టింది. ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌తో ‘చంద్రముఖి’ తో పాపులర్‌ అయ్యింది. అలా స్టార్‌ హీరోలతో చేసి క్రేజ్‌ను సంపాదించుకున్న నయనతార ఆ తరువాత.. విజయ్‌సేతుపతి, శివకార్తీకేయన్, ఆర్య‌ వంటి యువ హీరోలతో నటించింది. అలాంటి చిత్రాల విజయాలు నయనతార కే ఎక్కువ ప్లస్ కావడంతో… హీరోయిన్‌ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకుంది.


 
ఇక న‌య‌న్ ఎల్ల‌ప్పుడూ వార్తల్లో ఉంటూ తన పాపులారిటీని పెంచుకుంటూ ప్ర‌స్తుతం ఈ భామ‌ సుమారు 6 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసే స్థాయికి ఎదిగింది.  కుర్ర హీరోల బదులుగా స్టార్‌ హీరోలతోనే నటించడం మొదలెట్టింది. ఎందుకంటే స్టార్‌ హీరోల చిత్రాల్లో పెద్దగా నటించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఆమె నటించిన ‘సైరా నరసింహారెడ్డి’, తీసుకుంటే ఆమె పాత్ర‌కి పెద్ద‌గా స్కోప్‌లేదు.  తమిళంలో విజయ్‌తో నటించిన ‘విజిల్’, రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్‌’ చిత్రాలలో నయనతార పాత్ర చాలా తక్కువ. పారితోషికం మాత్రం 4 కోట్లకు పైనే అట. అందులోనూ సినిమా ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు వీట‌న్నిటికి అటెండ్ అవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.
 


తక్కువ కాల్‌షీట్స్‌తో ఎక్కువ పారితోషికం లభించడమే నయనతార స్టార్‌ హీరోలతో నటించాలనే నిర్ణయానికి కారణం. అంతేకాక దానికి త‌గ్గా క్రేజ్ కూడా ఎటూ వ‌స్తుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. హీరోతో రెండు పాటలలో లెగ్‌ షేక్‌ చేయడం.. మరో నాలుగు సన్నివేశాల్లో కనిపించడం చేస్తే చాలు. ఆ చిత్రాల విజయాలు ఎలాగూ తన ఖాతాలోనూ పడతాయి. ఇప్పుడు ‘విజిల్’,’దర్బార్‌’ వంటి చిత్రాల విజయాలను నయనతార షేర్‌ చేసుకుంటోంది. ఇక హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో ఎలానూ తన ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఆ తరహా చిత్రాలూ చేస్తోంది. ఈమె తెలివి మాములుగా లేదుగా. హీరోల‌ను మించి తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: