తెలుగు ప్రజలు కరోనా భయాల మధ్య ఈరోజు జరుపుకుంటున్న తెలుగు ఉగాది పండుగ ఎటువంటి హడావిడి లేకుండా చాల సాదాసీదా గా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో పండుగలకు దేవుళ్ళ కు చాల దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఉగాది పచ్చడి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 


నిన్నరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ మూడు వారాల పాటు ప్రకటించడంతో ప్రస్తుత పరిస్థితులలో ఇంటిని వదిలి ఎవరైనా బయటికి వస్తే పరిస్థితి ఏమిటి అంటూ అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆర్డర్స్‌ పై పోలీసువారు హెచ్చరిస్తున్నట్లుగా రిథమింగ్ పదాలతో కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 


ఈ రిథమింగ్ వర్డ్స్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోస్ట్ చేయడం విశేషం. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోలీస్ హెచ్చరిక అంటూ పోస్ట్ చేసిన ఓ మెసేజ్ వైరల్ అవుతుంది. ‘‘ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి.. ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి’’ అంటూ సెటైరికల్ మాటలతో కూడిన కామెంట్స్ కు మంచి స్పందన వస్తోంది. 


ప్రస్తుతం దేశం అంతా కర్ఫ్యూ లాంటి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితులలో దేశంలో ఏప్రిల్ 14 వరకు అమలు కాబోతున్న లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రజలు ఏం చెయ్యాలో ఏవి చెయ్యొద్దో తెలియచేసే 13 గైడ్ లైన్స్ ఒక పాఠ్యాంశoగా ప్రజలు చదువుకుంటున్నారు. చివరకు ఈ రాబోతున్న మూడు వారాలలో శవయాత్రల పైనా ఆంక్షలు కొనసాగుతాయని అంతిమ యాత్రల్లో 20 మందికి మించి జనం హాజరుకావొద్దని కేంద్రం చెపుతున్న పరిస్థితులలో ఈ మూడు వారాలు ఎలా గడుస్తాయి అన్న ఆలోచనలలో నేటి సగటు వ్యక్తి ఉన్నాడు. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తాము అన్న నమ్మకంతో ఈరోజు తెలుగు ప్రజలు ఉగాది పండుగను జరుపుకుంటూ కరోనా ను శాంతించమని వేడుకుంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: