తెలుగు పండ‌గ‌లు ఏమైనా ఉన్నాయంటే చాలు ముందు అంద‌రూ ఆలోచించేది ఇళ్ళ‌ల్లో మంచిగా వండుకుని తిని సాయంత్రం అయ్యేస‌రికి ఏదైనా ఒక కొత్త సినిమా చూడ‌టం మ‌న తెలుగువారికి ఆన‌వాయితీ. ఇక ఈ పండ‌గ‌కి ఏ సినిమాలు విడుద‌లున్నాయి. వాటికి టికెట్లు దొరుకుతాయా లేదా... లేదంటే.. ముందుగానే బుక్ చేసుకుందామా అంటూ ఇలా ఎప్ప‌టిక‌ప్పుడూ టెన్ష‌న్ ప‌డిపోతుంటారు మ‌న‌వాళ్ళు.  మ‌రి ఈసారి మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. క‌రోనాతో అన్ని చోట్ల అన్నీ నిలిపివేవారు. అన్నిచోట్ల దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొనింది. ఎక్క‌డిక‌క్క‌డ షూటింగ్‌లు అన్నీ ఆగిపోయాయి. సినిమాల రిలీజ్‌లు కూడా ఎక్క‌డా లేవు. షూటింగ్‌లు పూర్త‌యి విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా అన్నీ ఆగిపోయాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ణికిస్తున్న క‌రోనా వ‌ల్ల ఎక్క‌డి వారు అక్క‌డే ఉంటున్నారు. దీంతో సినిమాలు అన్నీ వాయిదా ప‌డిపోయాయి. టాలీవుడ్‌లో మాత్రం అస్స‌లు పండ‌గ హ‌డావిడి లేదు. 

 

కొత్త సినిమాలు లేక‌. షూటింగ్ అయిన చిత్రాలు విడుద‌ల‌వ్వ‌కా ఇండ‌స్ట్రీ మొత్తం పూర్తిగా న‌ష్టాల్లో ప‌డిపోయింది. చిన్న కార్మికుల నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు ఎవ్వ‌రికీ ప‌ని లేకుండా పోయింది. రోజూ షూటింగ్‌కి వెళుతూ అక్క‌డ పెట్టే భోజ‌నం తింటూ వాళ్ళు ఇచ్చే రోజువారి బేటా తీసుకుంటూ ఉండే చిన్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ‌కు కూడా ఈ మ‌హ‌మ్మ‌రి క‌రోనా వ‌ల్ల ప‌ని లేకుండా పోయింది. దాంతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు సినీ కార్మికులు. ఈ 2020 ఉగాది సినిమా సందడి లేకుండా ముగియనుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఉగాది సినిమా కళ కోల్పోయింది.  తెలుగు వారి ప్రసిద్ద పండుగలలో ఒకటైన ఉగాది కాగా తెలుగు రాష్ట్రాలు కరోనా కర్ఫ్యూ కారణంగా నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు కరోనా వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగం స్వచ్ఛందంగా బయటికి రాకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు.

 

ఈ నేపథ్యంలో సాధారణంగా ఉగాది రోజు ఉండే నూతన చిత్ర ప్రారంభోత్సవాలు, ఫస్ట్ లుక్స్, టైటిల్ పోస్టర్స్ వంటి అప్డేట్స్ ఏవి ఉండవు. దీంతో మొత్తం ప్ర‌పంచ‌మంతా కూడా చాలా నిర్మానుష్యంగా మారింది. ఇక ఇప్పటికే రెండు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ మూసి వేయడంతో పాటు, కొత్త సినిమాల విడుదల ఆపివేశార‌నే సంగతి తెలిసిందే. దీనితో ఎన్నడూ ఎరుగని విధంగా 2020 ఉగాది సినిమా కళ కోల్పోయింది. అస‌లు థియేట‌ర్లు కూడా మూత ప‌డ్డాయి. సెల‌వలు వ‌చ్చి బోర్ కొడితే ప‌దండి ఏద‌న్నా సినిమాకి వెళ‌దాం. అనే ప‌రిస్థితి లేకుండా పోయంది. గుంపులు గుంపులుగా ఉంటే వ‌చ్చే ఈ వ్యాధికి భ‌య‌ప‌డి ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: