ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన టైటిల్, మోషన్ టీజర్ విడుదల కానుంది. రాజమౌళి అన్ని భాషల్లోను ఈ సినిమాకు ఒకే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు చాలా టైటిల్స్ వినిపించినా రైజ్.. రివోల్ట్.. రివెంజ్ అనే టైటిల్ నే రాజమౌళి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 
 
మరికాసేపట్లో టైటిల్ గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. చరిత్ర ప్రకారం వీరిద్దరూ కలవకపోయినా వీరిద్దరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఉంటే ఏ విధంగా ఉంటుందనే కల్పిత కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 
 
జనవరి 8 2021 ఈ సినిమా విడుదల కానుంది. మొదట జులై 31 2020న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించినా వివిధ కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. 
 
ఎన్టీయార్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తూ ఉండటం... ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ సినిమాపై రికార్డు స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ సినిమా 250 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: