తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ హీరోగా  ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.  అచ్చమైన తెలుగు హీరో అయిన అజిత్ కుమార్ తమిళ్ లో సెట్ అయ్యాడు.  అక్కడే ఆయన స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.  తమిళ్ హీరోయిన్ షాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ అజిత్ సంపాదించుకున్నాడు.  అజిత్ నటించే ప్రతి చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంటున్నాయి.  తనకు స్టార్ హీరో హోదా ఉన్నప్పటికీ అజిత్ ఎంతో సింపుల్ గా నేచురల్ గా ఉంటారు.. ఈ మద్య వస్తున్న చిత్రల్లో ఆయన తెల్ల జుట్టు తోనే కనిపిస్తున్న విషయం తెలిసిందే. 

 

ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ రూపొందుతుంది.  ఈ  చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కనిపించనున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితం బయటికి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ పాత్రతో పాటు ఆయన మరో పాత్రలోను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆ పాత్ర ఏమిటనేది గోప్యంగా ఉంచారు.   'వాలిమై' రూపొందుతోంది ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఆ తరువాత షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు.  

 

ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే విషయం ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే అంశమే. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా  సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెబుతున్నారు.   ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకుంటున్న తరుణంలో ఇందులో అజిత్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్న విషయం తెలుసుకొని ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: