టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ ఫుల్ టైటిల్ ని కాసేపటి క్రితం తమ అఫీషియల్ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు. 'రౌద్రం రణం రుధిరం' గా ఈ సినిమా టైటిల్ ని నిర్ణయించి, హీరోలిద్దరూ గ్రాఫికల్ మోషన్ స్టైల్ లో పరుగెత్తుతూ వెళ్తున్న మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉండనుందో మనకు అర్ధం అవుతుంది. అలానే హీరోలిద్దరి పాత్రలు కూడా ఎంతో అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక ఈ మోషన్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరొక స్థాయిలో ఉందని, తప్పకుండా ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లో మరొక సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు సినిమా అభిమానులు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా, రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న స్కాట్, లేడీ స్కాట్స్ ఫస్ట్ లుక్ పొస్టర్లను కూడా ఇటీవల రిలీజ్ చేసిన సినిమా యూనిట్, సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. 

 

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీరిద్దరికి జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుండడం విశేషం. టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్, బాలీవుడ్ లోని ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. ఇక ప్రస్త్తుతం ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: