ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీలు ఏం మాట్లాడినా.. ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంది.  ఈ నేపథ్యంలో ఈ మద్య హిట్ చిత్రంతో మంచి విజయం అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వర్గం వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు ఇతరుల మనోభావాలను కించపరచవచ్చు. మనకి ఆ ఉద్దేశం లేకపోయినా కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.  ఈ కాలంలో ఊరకనే మనోభావాలు హర్ట్ అయిపోతుంటాయి కాబట్టి సెలెబ్రిటీలు ఒకటికి రెండు సార్లు తాము మాట్లాడే మాటల గురించి చూసుకోవడం మంచిది.  ఈ నెల 22న ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూని ప్రకటించిన విషయం తెల్సిందే.

 

సాయంత్రం 5 గంటలకు అందరూ తమ తమ ఇళ్ల వద్దే చప్పట్లు కొట్టి ఈ కష్ట సమయంలో ఆడుకుంటున్న డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్ కు, ఇతర ఎమర్జెన్సీ సేవకులకు సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని చెప్పిన విషయం తెలిసిందే.  ఈనేపథ్యంలో యావత్ భారత దేశం అంతా తమ ఇంటికే పరిమితం అయి ఐదు గంటల తర్వాత చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు విశ్వక్ సేన్ ఎందుకు ఫైర్ అయినట్టూ అనుకుంటున్నారా.. అసలు విషయానికి వస్తే.. ప్రధాని  మోదీ సూచనలు ఇంట్లో ఉండి చప్పట్లు కొట్టాలంటే కొంత మంది గుంపులుగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తూ.. చప్పట్లు.. ఇతర వాయిద్యాలతో సంఘీభావం చెప్పారు.

 

ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తాను చూసిన ఒక సంఘటన గురించి స్పందించాడు. ఇక్కడే ఒక టీ స్టాల్ ఓపెన్ చేసారు. అక్కడ కొంత మంది గుమిగూడి ఉప్పర సోది పెట్టారని క్లాస్ పీకాడు. అయితే ఆయన నోటి నుంచి ఉప్పర అనే మాట స్లిప్ కావడంతో ఆ వర్గం వాళ్ళు హర్ట్ అయ్యారట. అందుకోసమే ఇప్పుడు విశ్వక్ సేన్ తనకు ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదని తనను క్షమించాలని కోరినట్లు టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: