ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ నుండి సూపర్ అప్డేట్ వచ్చేసింది. ఈసినిమా పూర్తి టైటిల్ ఏంటో తెలుసుకోవాలని ఎప్పటినుండో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఈ రోజు టైటిల్ లోగో తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి డబుల్ సప్రైజ్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీం. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం,రణం,రుధిరం కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కూడిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాదుమిగితా దక్షిణాది భాషల్లో పాటు గా హిందీ లోనూ ఈసినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదలచేశారు. ఇక మేకర్స్ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు.
 
అదేంటంటే కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్స్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ తదుపరి షెడ్యూల్ పూణే లో జరగాల్సి ఉంది అది కూడా వాయిదాపడింది. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదాపడగా ఇప్పుడు కరోనా వల్ల మరోసారి అనుకున్న సమయానికి రిలీజ్ కాదంటూ రూమర్లు వచ్చాయి. కానీ ఈరోజు టైటిల్ పోస్టర్ లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదలకానుందని ప్రకటించడంతో అదే డేట్ కు రానుందని తేలిపోయింది.
 
అయితే ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మరో అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. స్వాతంత్య సమరయోధులు కొమరంభీం ,అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనుంది. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా బుర్రా సాయి మాధవ్  మాటలు అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: