కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను ఏదో ఒక రూపంలో తెలియజేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలో ఈ కష్టకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేస్తుండగా, మరికొందరు తమ క్వారెంటైన్ టైంకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్‌ విద్యా బాలన్‌ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

 

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యా బాలన్ కరోనాకు థ్యాంక్స్ అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. `వాహనాల వల్ల జరిగే కాలుష్యం తగ్గిపోయింది. గాలి స్వచ్ఛంగా మారుతోంది. వృక్ష్యాలు బాగా పెరుగుతున్నాయి. ఆకాశం మేఘాలతో స్వచ్ఛంగా ఉంది. ఈ సమయంలో భూమి తిరిగి జీవం పోసుకుంటుంది` అంటూ విద్యా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ లో పోస్ట్ చేసింది. 2.30 నిమిషాల నిడివి గల వీడియోలో ప్రజలు వాతావరణాన్ని రక్షించటంలో చేస్తున్న తప్పులను ప్రస్థావించింది. అయితే ఈ వీడియోపై ఆమె అభిమానులు పాజిటివ్‌ గానే స్పందించినా కొంతమంది నెటిజెన్లు మాత్రం ఫైర్‌ అవుతున్నారు.

 

ప్రపంచాన్ని బంధీచేసిన  కరోనాకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టడం సరైనది కాదంటూ కామెంట్ చేస్తున్నారు. `ఈ సమయంలో ఇది సరైన పోస్ట్‌ కాదు` అని రిప్లై ఇస్తున్నారు. విలాసవంతమైన జీవితం గడిపే నీకు కరోనా లాంటి సీనియస్ అంశం కూడా ఇలాగే అనిపిస్తుంది. పర్యావరణం కాపాడాలని అందరికీ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చేసిన పోస్ట్ సమజసం కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by vidya balan (@balanvidya) on

మరింత సమాచారం తెలుసుకోండి: