ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ వారసులకు ఉండే ఫాలోయింగే వేరు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్‌ లోనూ ఇలా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు స్టార్ కిడ్స్‌ ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. గౌరిఖాన్ ల కూతురు సుహానా ఖాన్ ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షనే. తన డ్రెస్సింగ్ తో పాటు ఫ్యాషన్ సెన్స్ మీడియా లో హల్ చల్ చేస్తోంది ఈ స్టార్ కిడ్. తల్లి గౌరి ఖాన్ ఫ్యాషన్ స్టోర్ ద్వారా ఎన్నో ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది సుహానా. అంతేకాదు.. ప్రెస్టీజియస్ వోగ్ మ్యాగజైన్ కవర్  తో పాటు ద గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిల్మ్ తో  గ్లామర్ వరల్డ్ లోకి  ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

 

షారూఖ్ ఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ ఖాన్ కూడా అంతే .. సుహానా అంత యాక్టివ్ కాకపోయినా.. తన దైన స్టైల్లో సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఫిల్మ్ మేకింగ్ చదువుకుంటున్న  ఆర్యన్.. త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. ఇప్పటికే ఈ స్టార్ కిడ్ కి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు.

 

షారూఖ్ ఖాన్ కూతురితో పాటు సోషల్ మీడియాలో హైలైట్ అయిన స్టార్ కిడ్ ఐరా ఖాన్. అమీర్ ఖాన్ కూతురిగా పుట్టడంతో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నా, అవన్నీ పట్టించుకోకుండా ఇండివిడ్యువల్ గా తన క్రేజ్ కోసం కష్టపడుతోంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూట్స్ తో, హాట్ ఫోటోస్ తో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

ఇప్పుడున్న స్టార్ కిడ్స్ లో ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న సెలబ్రిటీ సన్ .. ఇబ్రహీం అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకైన ఇబ్రహీం.. సినిమాల్లోకి రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని చెబుతున్నాడు సైఫ్. అందుకే ఇప్పటినుంచే లుక్స్, బాడీ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు .ఆల్రెడీ సిక్స్ ప్యాక్ తో ఫోటోలకు ఫోజులిచ్చి నేను సినిమాల్లోకి రావడానికి రెడీ అంటూ హింట్ కూడా ఇచ్చాడు ఇబ్రహీం.

మరింత సమాచారం తెలుసుకోండి: