పేరుకు పెద్ద హీరో కూతురే అయినా వారి సహాయం లేకుండా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆమె ఒక్క నటినే కాదు మంచి సింగర్ కూడా. ఇటు తెలుగులోను, అటు తమిళ్ లోను తన సినిమాలతో ప్రేక్షకుల మదిలో తనదైనా ముద్ర వేసుకుంది. ఆమె ఎవరో అనుకుంటున్నారా మన స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అండి. అందం అభినయం ఉన్న అమ్మడుకి పెద్దగా అవకాశాలు రావడం లేదు.

 

కమల్ హాసన్ చెన్నైలో ఉన్నారు. ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్ కూడా చెన్నైలో ఉన్నారు. కానీ, ఒకే ఇంటిలో ఉండటం లేదు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. దీనికి కారణం కరోనా. ఈ మహమ్మారి ఎవరికీ సోకకుండా ఉండే క్రమంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కమల్ పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ముంబైలో ఉన్నారు. శ్రుతి, అక్షర తల్లి సారిక కూడా ముంబైలో ఉన్నారు. అలాగని, తల్లీ కూతురు ఒకే ఇంటిలో ఉండటం లేదు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు.

 

ప్రపంచ మొత్తాన్ని కరోనా వైరస్ గడలాడిస్తుంది. దేశంలో లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూసేశారు. ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా కారణంగా సినిమా షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా శృతి హాసన్ పది రోజుల క్రితం లండన్ నుంచి వచ్చారు.

 

ఇపుడు ఆమె ముంబైలో అమ్మతో కాకుండా వేరేగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఆమెతో పాటు ఇంట్లో ఎవరూ లేరన్నారు. కనీసం పని వాళ్లు కూడా లేరన్నారు. తన వంట నేనే చేసుకుంటున్నాన్నారు. నాకు నేనే కంపెనీ ఇచ్చుకుంటున్నాను' అని ఆమె తెలిపారు.

 

ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' ఒకటి, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'లాభం' మరొకటి. కరోనా వైరస్ క్లియర్ అయిన తర్వాత ఆ రెండు సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేస్తానని శ్రుతి హాసన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: