2019 సంక్రాంతికి విడుదలైన సినిమా f2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఈ సినిమాలో హీరోలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోయిన్ లుగా తమన్నా, మెహరీన్ నటించి మంచి సక్సెస్ ను సాధించారు. దాంట్లో కథ అమీ లేకపోయినా కూడా ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. అయితే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి వీరిద్దరూ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే చెప్పారు. f2 మంచి విజయం సాధించింది కాబట్టి f3 సినిమా మీద కొంచెం క్రేజ్ ఉంటుందనటానికి సందేహం లేదు.

 

f2 అసలు ఎవరు ఊహించని విధంగా 80 కోట్లు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా సంక్రాంతికి బరిలోకి దిగి మంచి సక్సెస్ అందుకుంది. ఇంకా దీంతో అనిల్ రావిపూడి మంచి ఫార్మ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నారు అనే విషయం పై ఆరా తీయగా `ఎఫ్3` కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడనే లీకులు అందాయి. ఇప్పటికి ఇద్దరు హీరోలు ఫిక్స్ కాగా టైటిల్ పరంగా f3 కాబట్టి మరో హీరోను బరిలోకి దించాలని చూస్తున్నారు దిల్ రాజు, అనిల్ రావిపూడి. ఈ సినిమాలో మూడవ హీరోగా మాస్ మహారాజ రవితేజ ని అనుకుంటున్నారట.

 

అయితే ఇలాంటి ఫన్ ఎంటర్ టైనర్ సినిమాలలో రవితేజ సైతం నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దీంతో రవితేజ ఈ సినిమాకి ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వీరి ముగ్గురితో ఎఫ్త్రీ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి ముహూర్తం కూడా ఖరారు అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు లో ఈ సినిమాను ప్రభించాలని అనుకుంటున్నారట. కాగా., ప్రస్తుతానికి వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ నేపథ్య చిత్ర షూటింగ్ లో ఉన్నాడు. ఇది జులై వరకు అయిపోతుందట.

 

అలాగే వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నారప్పసినిమా కూడా ఆగస్టు వరకు రిలీజ్ అవుతుందనే వార్తలు ఇప్పటికి వచ్చాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమా క్రాక్సినిమా కూడా మే లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆగస్టు లో షూటింగ్ మొదలు కానుందనే వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: