ఇప్పుడు  హీరోన‌యిన్లంద‌రూ సోష‌ల్ మీడియాని తెగ వాడేస్తున్నార‌ని చెప్పాలి. టైమ్ దొరికితే చాలు వాళ్ళ హాట్ హాట్ ఫొటోల‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తున్నారు. అందులోనూ యూత్ స్టార్స్ అయితే మ‌రీనూ. ఇక సోష‌ల్ మీడియాని మాకంటే ఎవ‌రూ బాగా వాడ‌లేరు అన్న‌ట్లుగా వాడుతున్నారు.  క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ చిత్రంలో పూరి ఆకాష్ స‌ర‌స‌న న‌టిస్తున్న భామ కేతిక శ‌ర్మ ప్ర‌స్తుతం ఇదే ప‌నిలో ఉంది. `రొమాంటిక్‌` చిత్రం ద్వారా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న అంద చందాల‌తో వేడెక్కించేస్తుంది.

 

 ఇందులో భాగంగా తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది. దీంతో ఒక్కసారిగా కేతిక శర్మ అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు ఆమె అందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈమె అంద‌చందాల‌తో కురాళ్ళ గుండెల్లోగుబులుపుట్టిస్తుంది ఈ భ‌మ‌. మరికొందరు మాత్రం ఆ మాత్రం లేకుంటే పూరి జగన్నాద్ తన కొడుకు చిత్రంలో నటించేందుకు హీరోయిన్ గా సెలెక్ట్ చేయడు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

అయితే ప్రస్తుతం కేతిక శర్మ నటిస్తున్నటువంటి రొమాంటిక్ అనే చిత్రం ఇప్పటికే దాదాపుగా 50 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ట‌. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మాత గా వ్యవహరిస్తోన్న విష‌యం తెలిసిందే. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మే 29వ ఈ చిత్రాన్ని  విడుదల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ అమ్మడు ఇటీవలే మరో టాలీవుడ్ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌క‌మేందే రెండో సినిమానా అని కొంద‌రు నోరు వెల్ల‌బెట్టి మ‌రీ ఆలోచిస్తున్నారు. మ‌రి ఈ సినిమా క‌నుక హిట్ అయితే ఈ భామ ఎక్క‌డికో వెళ్ళిపోద్ద‌ని చాలా మంది అంచ‌నాలు వేస్తున్నారు. పూరి సినిమాలో హీరోయిన్ అంటే దాదాపు వాళ్ళ ద‌శ తిరిగిన‌ట్లే క‌దా.

మరింత సమాచారం తెలుసుకోండి: