చందమామ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అగ్ర‌క‌థానాయ‌కులంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా ఆఫ‌ర్లు రాన‌ప్ప‌టికి అంద‌రూ సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌స్తుంది. ఇక మెగా హీరోలంద‌రితోనూ దాదాపుగా న‌టించిన అవ‌కాశాం ముందు ఒక్క‌కాజ‌ల్‌దే అని చెప్పాలి. ఈ భామ ఇప్ప‌టికే ఇప్పటికే బాలీవుడ్ మూవీ‘ముంబై సాగా, ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తున్న ఆమె మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంద‌ని స‌మాచారం. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళినట్టు టాక్ వినబడుతోంది. ఇలయదళపతి విజయ్ త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ మొదలుపెట్టనున్నార‌ట‌.

 

అయితే తుపాకీ చిత్రంలో కూడా దాదాపుగా కథానాయికగా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘తుపాకి’ లో కూడా హీరోయిన్ కాజలే. అందులో ఆమె పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. కాజల్ సైతం మొన్నామధ్య ఇన్‌స్టా లైవ్ ద్వారా మాట్లాడుతూ విజయ్ తన ఫేవరెట్ కో స్టార్ అంటూ ఓ చిన్న  హింట్ కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ క‌న్‌ఫ‌ర్మేషన్ రావొచ్చని అనిపిస్తోంది. ఇకపోతే కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించారు.

 

మ‌రి ఈ ముదురు భామ పెద్ద ప్రాజెక్ట్‌ల‌ని బాగానే ప‌డుతుందే. ఎక్క‌డా గ్యాప్ ఇవ్వ‌కుండా పెద్ద సినిమాల‌న్నీ కూడా ఈమెనే వ‌రిస్తున్నాయి. ఇక ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌ల సీనియ‌ర్ హీరోల‌కి హీరోయిన్లు దొర‌క‌డం చాలా క‌ష్టంగా ఉన్న విష‌యం తెలిసిందే ఇక ఇదే అదునుగా తీసుకున్న కాజ‌ల్ చిరు సినిమాకి ఎక్కువే డిమాండ్ చేస్తుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ చిత్రానికి ఈ భామ ఎంత అడుగుద్దో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: