ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం సోష‌ల్ మీడియా మీదే ఎక్కువ ఫోక‌స్ పెడుతున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌పంచం అంతా కూడా ఈ సోష‌ల్ మీడియా దెబ్బ‌తో ఇదొక చిన్న గ్రామంలో మారిపోయింద‌ని చెప్పాలి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జ‌రిగినీ కూడా నిమిసాల్లో అంద‌రికి తెలిసిపోతుంది. సినిమా రాజ‌కియాల నుంచి సినీ సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ వారు ఎప్పుడు ఏ క్ష‌ణంలో ఏం చేస్తున్నారు అన్నది నిముషాల్లో సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌తి విష‌యం తెలిసిపోతుంది. ఒకొక్క‌రు ఒక్కో ర‌క‌మైన సోష‌ల్ మీడియాని వేదిక‌గా చేసుకుని అప్‌డేట్ ఇస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల‌లో త‌న ప‌ర్స‌నల్ విష‌యాల నుంచి ప్రొఫెన‌ల్ విష‌యాల వ‌ర‌కు ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు.

 

ఇక దాన్ని ప్ర‌త్యేకించి ఒక స్టార్ స్టేటస్‌ని కూడా తెలుసుకోడానికి ఈ యాప్‌ల‌ను బాగా ఉప‌యోగిస్తున్నారు. ఏ హీరోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్న‌ది ఈజీగా తెలుసుకోవ‌చ్చ‌. ఇక‌ సోష‌ల్ మీడియాల్లో అయితే ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, అల్లుఅర్జున్ వీళ్ళు ఎంత యాక్టివ్‌గా ఉంటారంటే వారి ప్ర‌తి మూమెంట్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఫ్యాన్స్ కోసం అప్‌డేట్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక త‌మ అభిమాన హీరో సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దులు ఉండ‌వ‌ని చెప్పాలి. 

 

ఇక సోష‌ల్ మీడియా అంటే కేవ‌లం ప్ర‌శంస‌ల వ‌ర్షం మాత్ర‌మే కాదు విమ‌ర్శ‌లు కూడా చాలా కామ‌న్‌గా వ‌స్తుంటాయి. అందులోనూ ఎవ‌రికైనా త‌మ‌కి ఏద‌న్నా హీరో న‌చ్చ‌క‌పోతే విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. కొంత మంది కొన్ని విష‌యాల్లో బాగా ఘాటుగా స్పందిస్తూ ఉంటారు మ‌రి అలాంటివాటిని చిరు ఏ విధంగా తీసుకుంటారు. విమ‌ర్శ‌ల‌ను సైతం ఆయ‌న డైజ‌స్ట్ చేసుకోగ‌ల‌రా...లేక ఆయ‌న ఎలాంటి రిప్లై ఇస్తారు. ఇక సోష‌ల్ మీడియా అంటేనే పెద్ద ర‌చ్చ అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఆయ‌న ఏ విధంగా స్పందిస్తారు అన్న‌ది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: