క‌రోనా ప్ర‌పంచ మంత‌టిని క‌ల‌వ‌ర‌పెడుతోన్న విష‌యం తెలిసిందే. అందుకు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు చాలా జాగ్ర‌త్త‌లు చెప్పి అవి పాటించ‌ని వారి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14 అర్ధ‌రాత్రి వ‌ర‌కు కూడా ఈ కర్ఫ్యూని విధించారు. ఇక సినిమా షూటింగ్‌లు అన్నీ కూడా  ఈ నెల 31 వ‌ర‌కు ఆపివేయ‌డం జ‌రిగింది. అయితే ఇప్పుడు ఉన్న తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి వ‌చ్చే నెల 15 వ‌ర‌కు పొడిగించారు. దీన్ని బ‌ట్టి సినిమా విడుద‌ల తేదీలు కూడా మార‌తాయి. 

 

ఇప్పటి వ‌ర‌కు కేవలం 30 రోజులు మాత్రమే షూటింగ్  జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం కూడా బాగా వెన‌క్కి వెళ్ళేట‌ట్టు ఉంది. ఉన్నా కొద్ది షూటింగ్ బాగా లేట్ అయ్యేటట్టు ఉంది. ఇక ఇదిలా ఉంటే సినిమా చిరంజీవి ఎంత త్వ‌ర‌గా అయిపోవాలని కోరుకున్నారో అంతే ఆల‌స్యం అవుతుంది. షూటింగ్‌ల‌న్నీ వాయిదా ప‌డ‌డంతో రిలీజ్ డేట్లు కూడా క‌చ్చితంగా మార‌తాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా వెనక్కి వెళ్లడంతో రిలీజ్ కూడా ఆగష్టు నుంచి వాయిదా పడనుంది. అలాగే ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో న‌టించ‌నున్నారు, అది కూడా ఓ పవర్‌ఫుల్ నక్సలైట్ లీడర్ పాత్రలో ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ దారుణంగా చంపబడతాడు. స్వతహాగా తమ హీరో చనిపోవడం అనే విషయాన్ని అభిమానులు తీసుకోలేరు. మాములుగానే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు సినిమాలో హీరోగాని హీరోయిన్‌గాని చ‌నిపోవ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌రు. అందులోనూ అది ఎంత క‌థ ప‌రంగా అయిన‌ప్ప‌టికీ ఓ స్టార్ హీరో అలా చ‌నిపోవ‌డం అనేది మాత్రం అస్స‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని చాలా మంది భావిస్తారు.

 

గతంలో మగధీర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ చనిపోయినా, ప్రస్తుతంలో బతికి ఉండ‌డంతో ఆ చిత్రం హిట్ కొట్టింది. కాబట్టి ఫాన్స్ వర్రీ అవ్వలేదు. కానీ ఇక్కడ చరణ్ చనిపోగా తన పోరాటాన్ని చిరు కంటిన్యూ చేస్తాడు. అనే కాన్సెప్ట్‌లో వ‌చ్చే ఈ చిత్రం ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుత‌ది. పైగా దాన్ని ఫ్యాన్స్ ఎంత‌వ‌ర‌కు తీసుకుంటారు. అనే విష‌యం పై కొంత క్లారిటీ రావ‌ల‌సి ఉంది.   కావున చిరు పాత్ర ద్వారా చరణ్ పాత్ర బతికే ఉంటది కాబట్టి అభిమానులు పెద్దగా డిజప్పాయింట్ కారనే అనుకోవాలి. లేదంటే పాత్ర‌కంటే హీరోకి ప్రాధాన్య‌మిస్తే ఇక చేసేదేమీ లేదనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: