మెగాస్టార్ చిరంజీవి  ట్విట్టర్ వేదికగా, ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు. ఆయన అకౌంట్ క్రియేట్ చేసారు. అయితే  మెగాస్టార్ చిరంజీవి  ఇప్పటిదాకా  తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు, అలాగే మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అయితే ఈరోజు చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షల్లో అభిమానులు ఆయనను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.

 

 

ఇంకా చిరంజీవి గారు తన అభిమానులకు కరోనా గూర్చి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. "అందరికి శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపి, నాతోటి భారతీయులందరితో,   తెలుగు ప్రజలతో,నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో   నేరుగా ఈ వేదిక  నుంచి మాట్లాడకలగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి  కంకణం కట్టుకుందాం.ఇంటిపట్టునే  ఉందాం. సురక్షితంగా ఉందాం" అంటూ చిరంజీవి ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చారు. అలాగే చాలా మంది సెలబ్రిటీలు, ప్రేక్షకులు చిరంజీవి కి స్వాగతం పలికారు.  

 

 

 

ఇక ఆయన కోడలు ఉపాసన 'వెల్కమ్ టు ట్విట్టర్ మామయ్య' అనే ట్వీట్ తో స్వాగతం పలికింది.మెగాస్టార్ స్పందిస్తూ... ఇకనుండి నా అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎప్పటికప్పుడు నా అభిప్రాయాలను ఆలోచనలను ట్విట్టర్ వేదికగా మీతో పంచుకుంటానని తెలిపారు. ఇంతవరకు సోషల్ మీడియాలో కనిపించని మెగాస్టార్ నిన్న ట్విట్టర్ లోకి రానున్నట్లు ప్రకటించేసరికి అందరు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.  కోడలు ఉపాసన కూడా మామయ్యకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంది. ఉపాసన సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. మెగాఫ్యామిలీ కి సంబంధిచిన ఏ  విషయం అయినా ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: