ఇప్పుడు మనిషి కరోనా వైరస్ పై జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్రతి నిత్యం ఏదో ఒక పనిపై తిరుగుతున్న మనుషులు కరోనా మహమ్మారి ప్రభావంతో ఇంటి పట్టున ఉండే పరిస్థితి ఏర్పడింది.  దేశ వ్యాప్తంగా కరోనా భయానికి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా నివారణకు ఎం చేయాలో సూచనలు..  సలహాలు ఇస్తున్నారు.  తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ మాత్రం నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఆమె అలా ఎందుకు చేసిందో ఆమె మాటల్లోనే వింటే నిజంగా అందరికీ కోపం రావడం ఖాయం. అసలు విషయానికి వస్తే..  ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతున్నారు. 

 

ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని.. సామాజిక దూరం అవలంభించాలని.. ఇలా ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటే.. కొంత మంది మూర్ఖులు మాత్రం తాము వాడిన మాస్కులు డస్ట్ బిన్ లో పడివేయకుండా రోడ్లపై పడేస్తున్నారు.  వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న మాస్కులను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారని, ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించింది.  ఈ మేరకు విసిరిపారేసిన మాస్కుల ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 

 

ప్రతిరోజు కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోతున్నారో తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా ఈ రోగాన పడి భయంతో వణికిపోతున్నారు.  ఇలాంటి విపత్కర సమయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని ప్రశ్నించింది. మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. వాడి పారేసిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేయాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే తాకొద్దు, వాడొద్దని సూచించింది.  మనం బాగుంటే సమాజం బాగుంటుందని.. ఇలా పనులు దయచేసి మానివేయండని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: