టాలీవుడ్ లో బాహుబలి ఫ్రాంచైజీ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నరో అందరికి తెలిసిందే. ఏకంగా తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు తెలుగు నుండి ఏ భారీ సినిమా వస్తున్నా బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలు ఎంతో ఆసక్స్తికరంగా చూస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో స్టార్స్ తో తెరకెక్కించే సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుండటానికి కారణం బాహుబలి సినిమాని తీసిన రాజమౌళి కారణం అని ప్రత్యేకంగా చెప్పాలి. అంతేకాదు ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన ఘనత కూడా జక్కన్నదే. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". 

 

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఎన్.టి.ఆర్ అభిమానులు, రాం చరణ్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రాంచరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గురించి ఒక్కో ఆసక్తికరమైన విషయాన్నీ బయటపెడుతు విపరీతమైన క్రేజ్ ని పెంచుతున్నారు మేకర్స్. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ని ప్రస్తుతానికి నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా నుండి ఇప్పట్లో ఎలాంటి గూడ్ న్యూస్ రాదనుకున్నారు అందరూ. కాని నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా "ఆర్ ఆర్ ఆర్" సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కి పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్ స్కూడా వస్తున్నాయి. 

 

వాస్తవంగా అయితే ఈ సంవత్సరం జులై 30న రిలీజ్ కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ 2021 జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు.  అయితే ఈ సారి మాత్రం మళ్ళీ రిలీజ్ డేట్ మార్చకూడదన్న పట్టుదలతో శరవేగంగా జక్కన టీం ఈ సినిమాని కంప్లీత్ చేసే పనిలో ఉండగా కరోనా వైరస్ బ్రేక్ పడేలా చేసింది. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ మోషన్ పోస్టర్ లో 2021జనవరి 8న సినిమాని విడుదల చేయడానికి లాక్ చేసినట్టు క్లారిటి ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా నుండి ఆలియా భట్ తప్పుకుందన్న రూమర్స్ కి జక్కన్న టీం చెక్ పెట్టింది.  
   

మరింత సమాచారం తెలుసుకోండి: