ప్రపంచం అంతా కరోనా బూచీతో భయపడి ఛస్తున్నారు.  మనుషులను మనిషి తాకాలంటేనే కిలో మీటర్ దూరం ఉరుకుతున్నారు.   కరోనా వల్ల దేశం ఇప్పుడు విల విలలాడుతుంది. ఈ సమయంలో సెలబ్రెటీలు కరోనా వైరస్ కట్టడి చేయడానికి తమకు తోచిన సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది.  షూటింగ్స్ క్యాన్సల్ చేసుకోవడంతో సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు.  ఈ సమయంలో వారిని కాపాడేందుకు సినీ నటులు ముందుక వస్తున్నారు. 

 

ఇప్పటికే రజినీకాంత్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. విజయ్ సేతుపతి పదిలక్షలు, సూర్య,కార్తి వారి తండ్రి శివకుమార్ తమ ట్రస్ట్ ద్వారా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.    కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నట్టు ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రకటించారు. తన పార్టీ (మక్కల్ నీది మయ్యం) వైద్యులతో కలిసి తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలను కుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తన ఇంటిని ఆసుపత్రిగా మార్చేస్తానని పేర్కొన్నారు.

 

ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సహృదయాన్ని ప్రదర్శించాలి.. క్లిష్ట పరిస్థితిలో ఒకరినొకరు ఆదుకోవాలి అన్నారు.  అంతే కాదు కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇందుకు అందరూ కట్టుబడి ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఇంటిపట్టున ఉండి కరోనాను కట్టడి చేయాలని అన్నారు.  మరోవైపు కరోనా వైరస్ తో ఇండస్ట్రీలో చాలా మంది సినీ కార్మికులు బాధపడుతున్న నేపథ్యంలో శివకార్తికేయన్ రూ. 10 లక్షలు, దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం, నిర్మాత ఢిల్లీబాబు 20 బస్తాల బియ్యం చొప్పున విరాళంగా అందించారు. నటుడు మనీష్ కాంత్ 40 కిలోల పప్పుదినుసులు, తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్ అసోసియేషన్ తరపున 100 కిలోల బియ్యం చొప్పున అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: