పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. టాప్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు స్వాతంత్య్ర సమర యోధులు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్  మరియు మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈచిత్రానికి  రౌద్రం,రణం, రుధిరం అనే టైటిల్ ను పెట్టారు. ఇక ఈ టైటిల్ కు సీనియర్ డైరెక్టర్ వి వి వినాయక్ నిర్వచనం చెప్పాడు. బ్రిటీష్ పాలనా పై కట్టలు తెచ్చుకున్న రౌద్రం (కోపం).. ఆఇద్దరు కలిసి చేయాలనుకున్న రణం (యుద్ధం).. ఆయుద్ధం లో వాళ్ళు చిందించిన రుధిరం (రక్తం) అని వినాయక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 
 
 
 
ఇక టైటిల్ తోపాటు మోషన్ పోస్టర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా  రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని మోషన్ పోస్టర్ ను చూస్తేనే అర్ధమవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ,చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కనిపించనున్నారు. సుమారు 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 జనవరి 8న విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: