ఒక హీరో అంటేనే అభిమానులు పడి చస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు అంటే ఆ మోజే వేరుగా ఉంటుంది. నిజానికి ఫ్యాన్స్ లో ఒక దురభిప్రాయం కూడా ఉంది. తమ హీరోలకు ఒకరితో ఒకరికి పడదని భావిస్తారు. దాన్ని తప్పుడు అభిప్రాయం అని రుజువు చేయడానికైనా హీరోలు ముందుకు వచ్చి నటిస్తే టాలీవుడ్ పచ్చంగా ఉంటుంది.

 

కానీ చాలా కాంబోలు ఫ్యాన్స్ ఊహల్లోనే  ఉండిపోతున్నాయి. అవి ఎక్కడా వర్కౌట్ అవడంలేదు. గతంలో అంటే  ఎన్టీయార్  ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబుల‌ టైంలో హీరోలకు పెద్దగా ఇమేజ్ బాధ లేదు. నిర్మాతలు, దర్శకులు అంతా ఒక ఫ్యామిలీగా ఉండేవారు. దాంతో కధ డిమాండ్ చేస్తే వారు చిన్న పాత్రనైనా చేసుకుపోయేవారు. అలా ఎన్నో మల్టీస్టారర్లు వచ్చేవి.

 

రాను రానూ అది తగ్గిపోయింది ముఖ్యంగా చిరంజీవి బాలయ్య, వెంకీ, నాగార్జున తరం వచ్చాక మల్టీ స్టారర్ మూవీస్ అసలు  లేకుండా పోయాయి. ఒక దశలో బాలయ్య, చిరు కాంబోతో మల్టీ స్టారర్ మూవీ వస్తుందని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చేవి. అలాగే డైరెక్టర్లుగా అప్పట్లో కోడి రామక్రిష్ణ, కోదండరామిరెడ్డిల పేర్లు వినిపించేవి. ఈ ఇద్దరు హీరోలు వీరి డైరెక్షన్లో చాలా సినిమాలు చేసి హిట్లు కొట్టిన రోజులవి.

 

ఇక వెంకీ, నాగార్జున విషయంలో కూడా ఇలాంటి వార్తలే ప్రచారంలో ఉండేవి. రామానాయుడే ఈ ఇద్దరినీ కలిపి మల్టీ స్టారర్ మూవీ తీస్తారని కూడా చెప్పుకున్నారు. ఏమైందో   ఆగిపోయాయి ఆ ఆలోచనలన్నీ. ఇక ఇపుడు తరంలో చూసుకుంటే బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అది జరిగే పనేనా.

 

అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కలసి మూవీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఆ మూవీలో రాం చరణ్ కూడా ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ అవి ఇప్పటికైతే కలలే. తీరితేనే తెరపైన ఫ్యాన్స్ ఈలలు వేసి మరీ  చూసేది. మరి అది జరుగుతుందా. ఏమో ఎవరు చెప్పగలరు. వెయిట్ చేయాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: