కరోనా వైరస్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం ఆగిపోయాయి. వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ ఎక్కువ అవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండస్ట్రీలో అందరూ షూటింగ్ ఆఫ్ చేయడం జరిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రధాని ఆదేశాల మేరకు లాక్ డౌన్ పాటిస్తోంది.

 

కరోనా వైరస్ అరికట్టాలంటే కచ్చితంగా భారతదేశం 21 రోజులు అప్రమత్తంగా ఉంటే చాలావరకు కరోనా వైరస్ నివారించవచ్చు అంటూ అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా భారత్ లో నెలకొన్న లాక్ డౌన్ నిర్ణయాన్ని స్వాగతించి...భారతీయులలో మంచి ఐకమత్యం ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ విధంగా భారతీయులు కొనసాగిస్తే వాళ్లు కచ్చితంగా కరోనా వైరస్ పై గెలుస్తారు అని చెబుతున్నారు.

 

ఆ వార్తలు అలాగంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తన దగ్గరికి కథలు చెప్పడానికి వచ్చే డైరెక్టర్లకు ఒకే ఒక పాయింట్ చెబుతున్నారట. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అలాంటి కథ ఉంటేనే నా దగ్గరకు రండి అంటూ తన ప్లాన్ ముందే డైరెక్టర్లకు చెప్పేశారట.

 

ముఖ్యంగా సైరా సినిమా యుద్ధ పోరాటాలను తలపించే ప్రయోగాత్మక చిత్రం కావటం ఆశించిన స్థాయిలో సినిమా ఆడకపోవడంతో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్లో టాక్. మొత్తానికి అయితే ఎటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మరియు ప్రయోగాత్మక చిత్రాలు చేసే ప్రసక్తి లేదని చిరంజీవి డిసైడ్ అయినట్లు సమాచారం. తాజాగా చిరంజీవి తీసుకున్న మరియు కమర్షియల్ సినిమాల ప్లానింగ్ కెరియర్ కి పాజిటివ్ అవుతుందో నెగటివ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: