టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలలో హీరో ఎంతగా స్టార్ డం ని సంపాదించుకుంటారో అదే రేంజ్ లో పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ కూడా క్రేజ్ ని సంపాదించుకుంటారు. అంతేకాదు కొంతకాలం టాలీవుడ్ లో స్టార్ హీరోల తో అవకాశాలు అందుకుంటూ ఏలతారు కూడా. అందుకు కారణం పూరి తన సినిమాలో హీరోయిన్స్ ని ఎంతగా స్ట్రాంగ్ క్యారక్టరైజేషన్ లో చూపిస్తారో అంతకంటే డబుల్ డోస్ లో గ్లామర్ ని చూపిస్తారు. హీరోయిన్ లో ఉన్న అందాలన్నిటిని హైలెట్ చేసి మరీ పాపులారిటిని తెచ్చి పెడతారు.

 

అలాగే పూరి టాలీవుడ్ కి 'హార్ట్ ఎటాక్' సినిమాతో ఆదా శర్మ ని తీసుకు వచ్చాడు. యంగ్ హీరో నితిన్ తో పూరి తీసిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ అవనప్పటికి సినిమాకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తో అదాకి హీరోయిన్ గా మంచి ఫేం కూడా వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి కొన్ని సినిమాలు చేసినప్పటికి మంచి హీరోయిన్ అన్న పేరు తప్ప స్టార్ హీరోయిన్ అన్న పేరు మాత్రం దక్కలేదు. అంతేకాదు గత కొన్ని కాలంగా సినిమా అవకాశాలు లేక ఆవురావురంటుంది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తో ప్రతీ ఒక్కరు లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అందరు తమ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేలా ప్రభూత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 

 

అందుకే సామాన్య ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దాంతో అందాల ఆదా ఇంటి పనులను చక్కదిద్దుకొనే పనిలో పడింది. అంతేకాదు అందరిలాగే తను కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుంది. అవి కూడా హాట్ ఫొటో షూట్స్ మాదిరిగానే. ఆదా కరోనా కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇల్లు శుభ్రం చేసుకుందాం అని హాట్ డ్రెస్ లో ఒళ్ళంతా కన్పించేలా ఇల్లు క్లీన్ చేసుకుంటుంది. అయితే ఇందులో కూడా యోగా భంగిమలను ఉపయోగిస్తూ తన మార్క్ హాట్ నెస్ ని చూపిస్తూ అదా హాట్ అనిపించుకుంటుంది. ఈ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. వీటికి నెటిజన్స్ హాట్ హాట్ కామెంట్స్ ని పెడుతున్నారు. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: