చిత్ర సీమ అని అందుకే అన్నారు. అక్కడ ఎపుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రి స్టార్ అయిన వారు ఉన్నారు. మరుసటి రోజే బికారి గా మారిన వారూ ఉన్నారు. సినీ రంగం ఓ విధంగా మయసభ లాంటిది అక్కడ లేనిది ఉన్నట్లుగా ఉంటుంది. ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. మరి వి చిత్ర సీమలో విచిత్రాలు ఎన్నో

 

ఇప్పటికి ఎనభై ఏళ్ళు అయింది టాలీవుడ్ పుట్టి. ఈ మధ్యలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ఒకనాడు నిర్మాత పవర్ ఫుల్. ఎంతటి శక్తిమంతుడంటే ఆయన హీరోలను ఆ క్షణానికి మార్చేసి తనకు నచ్చిన వారిని పెట్టుకునేవారు. ఆ తరువాత డైరెక్టర్లు కూడా అంతే శక్తియుక్తులతో ఉండేవారు. వారి మాట జవదాటడం అంటే హీరోలకు  అసలు ఊహకే వచ్చేది కాదు. ఎంతటి పెద్ద స్టార్ అయినా డైరెక్టర్ ముందు కొత్త స్టూడెంటే.

 

మరిపుడు చూస్తూంటే హీరో విశ్వరూపం చూపిస్తున్నాడు. మిగిలిన వారంతా మరుగుజ్జులైపోతున్నారు. ఇక నిర్మాత సీన్ చూస్తే బాధ ఒక్కటే తక్కువ. ఆయన మొత్తం సినిమాకు డబ్బులు పెడతాడు. సినిమా అన్న వూహ అలా ఆయనతోనే  నిజం అవుతుంది అనుకుంటే అది నిర్మాత ఉండబట్టే. కానీ ఆ నిర్మాత ఇపుడు రోడ్డు మీద ఉంటున్నాడు.

 

సూపర్ హిట్ అయిన సినిమాకు లాభంలో హీరోలు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు పంచుకుపోయ్తే మిగిలింది చిల్లి గవ్వ. ఇక సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత ఇక గాయబ్ అయిపోతాడంటే మరి కనిపించడన్నమాట. ఇపుడు నిర్మాత కుర్చీని కూడా కెలికేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇక  సినిమాల్లో వాటాలు,  జిల్లాల హక్కులు ఇలా అన్నీ అడిగేసి కడిగేసి  నిర్మాతని పూర్తిగా సైడ్ చేసేస్తున్నారు.

 

దానికి కొత్తగా కనుగొన్న మంత్రం ఏంటి అంటే హీరో గారు ఒక నిర్మాణ సంస్థను పెడతారు. అది ఊరికే అన్న మాట. ఉత్తిత్తిదే అని కూడా చెప్పాలి. దాన్ని నిర్మాతగా వాస్తవానికి సినిమా తీసే  ఎవరో బకరా దొరికితే ఆయనతో పార్టనర్ పేరు చెప్పి కధ నడుపుతారు. అలా నిర్మాతగా లాభాలు వస్తే తమ ఖాతాలో వేసుకుంటారు. నష్టాలు, కష్టాలు వస్తే మాత్రం ఆ బకరా నిర్మాత భరించాల్సిందే. ఇదే ఇపుడు సరికొత్త ఫ్యాషన్ అంటూ విమర్శలు వస్తున్నాయి.

 

అందుకే చాలా మంది ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి నిర్మాత పాత్రలో కూడా తామేనంటూ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. మొత్తానికి అంతా కలసి నిర్మాతను లేకుండా చేశారనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: