కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తుంది. దీంతో ప్రధాని మోడీ ఈ వైరస్ ని అరికట్టాలంటే కచ్చితంగా 21 రోజులపాటు ఇంటికి పరిమితం కావాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రంగాలు మూసుకుపోయాయి. అభివృద్ధి చెందిన యూరప్ మరియు అమెరికా లాంటి ప్రాంతాలలో ఈ వైరస్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. దీంతో ఒక దేశం నుండి మరొక దేశానికి విమాన రాకపోకలు రవాణా సదుపాయం మొత్తం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా రవాణా సంస్థ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వాళ్లను భారత ప్రభుత్వం సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) ముద్ర వేస్తున్న తరుణంలో పూర్తిగా ఇంటికి పరిమితమవుతున్నారు. తాజాగా సౌత్ ఇండియా విలక్షణ నటుడు కమలహాసన్ ఇటీవల విదేశాల నుండి తిరిగి భారత్ కు రావడంతో సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) ముద్ర వేయడంతో ఇంటికి పరిమితం అయ్యారు. ఈ సందర్భంలో అర్జెంటు పని ఉన్నా గాని కూతుళ్లను కమలహాసన్ కలవకుండా రూములోనే ఉండిపోయాడట.

 

స్వయంగా ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తూ సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్నారు. మరోపక్క ఈ వైరస్ ప్రభావం ఉన్న కొద్ది స్పెయిన్ దేశంలో చాలా దారుణంగా ప్రబలంగా మారుతోంది. ఒక్కరోజులోనే 500కు పైగానే మనుషులు చనిపోవడం జరిగింది. ఈ విధంగానే స్పెయిన్ దేశంలో పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఇటలీ మాదిరిగానే స్పెయిన్ దేశం కూడా శవాల గుట్టగా మారటం గ్యారెంటీ అనే టాక్ వినపడుతోంది. చాలామంది త్వరగా వ్యాక్సిన్ కనుక్కోవాలని దైవానికి ప్రార్థిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఇంకా ముందు ముందు ఉంటే గనుక మనిషి జీవన మనుగడ ప్రమాదంలో పడినట్లే అంటూ అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: