మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల కంటే సోషల్ మీడియాలో అనే వార్తలు చాలా ఫాస్ట్ గా రావడంతో చాలా వరకు మనుషులు సోషల్ మీడియా కి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా వాస్తవ ప్రపంచంలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలు గడుపుతున్నారు. ఇతర సెలబ్రిటీలు అయితే ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఉగాది పండుగ పర్వదినం నాడు చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వటంతో అభిమానులు కొంత మంది ఫాలో అవ్వడం జరిగింది.

 

 

దీనికి సంబంధించి వీడియోని ముందే రిలీజ్ చేసి క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో అంటే ఖచ్చితంగా ట్రోలింగ్ ఎదుర్కోవలసి ఉందే. దీంతో తాజాగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి సోషల్ మీడియాలో నెటిజన్ లు...ఒకపక్క వైరస్ వచ్చి ప్రజలు విలవిలలాడుతూ చనిపోతుంటే ఏంది మీ గోల అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

 

ఇటువంటి పరిస్థితుల్లో చాలా గౌరవప్రదంగా ఇండస్ట్రీలో మరియు బయట కూడా మంచి పేరు ఉన్న చిరంజీవి...ఇలాంటి ట్రోలింగ్ మరియు కామెంట్లను తట్టుకునే అంత సీన్ ఉందా..? అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. అయితే వైరస్ ప్రమాదకరంగా మారటంతో ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు మొత్తం క్యాన్సిల్ అవ్వటంతో ఇంటికి పరిమితం అయ్యారు. మరోపక్క మెగా అభిమానులు...చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టడంతో ఆయన్ని మెల్ల మెల్లగా ఫాలో అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: