సంయుక్త మీనన్ 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పరిచయమైన తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళ బ్యూటీ. సంయుక్త మీనన్ వరుస అవకాశాలతో దూసుకుపోతూ మలయాళం, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఒక న్యూస్ ద్వారా వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆకతాయిలు సెలబ్రిటీలని ఇబ్బందికి గురిచేసే సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సంయుక్త మీనన్ కూడా అలాంటి చేదు అనుభవమే ఎదుర్కొంది. సంయుక్త మీనన్ ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించే కార్యక్రమం చేసింది. ఈ చిట్ చాట్ లో ఓ నెటిజన్ సంయుక్త మీనన్ ని అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు. మీరు వర్జినా అంటూ ప్రశ్నించాడు. దీనితో సంయుక్త మీనన్ ఆగ్రహంతో అతడికి అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

 

మిస్టర్ అతుల్ పీకే.. నీలాంటి వాళ్ళు వర్జినిటీ, సెక్స్, ఆల్కహాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు ఎక్కడైనా ఇలాంటి విషయాలు మాట్లాడడం చూశావా, లేదా నీకు ఇలాంటివే ఇష్టమా?, అయితే నీకు ఏదో సమస్య ఉన్నట్లే.  ఇలాంటి కామెంట్స్ కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. నీ చెంప...పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని సంయుక్త మీనన్ సదరు ఆకతాయికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరాలుగా స్పందిస్తున్నారు.

 

సోషల్ మీడియాలో సెబ్రెటీలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి బ్యాచ్ ఒకటి ఎప్పుడూ ఉంటుంది. వీళ్లకి ఇది కామన్ అయిపోయింది. కొంతమంది హీరోయిన్లు ఇలాంటివి పట్టించుకోక పోగా సంయుక్త మీనన్ లాంటి వాళ్ళు ఇలాగా ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. ఇలా వార్తల్లో నిలిచిన ఈ భామ త్వరలో టాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: