సినీ సెలబ్రిటీస్ తమ పబ్లిసిటీకి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఫొటోషూట్స్, సెలబ్రేషన్స్, వెకేషన్స్, అనౌన్స్ మెంట్స్, ఈవెంట్స్, ఫ్యాన్స్ తో లైవ్ చాట్స్.. ఇలా అన్నింటి షేరింగ్ కు వీటిని వేదికగా చేసుకుంటున్నారు. ఈ మూడు ప్లాట్ ఫామ్స్ లో ఒకటైన ట్విట్టర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. ఈనెల మార్చి 27న (రేపు) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో అఫిషియల్ అకౌంట్ ను ఓపెన్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

 

 

 గతంలో చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసేశాడు. తర్వాత ఫేస్ బుక్ లో మాత్రమే తన పోస్టులు, అభిప్రాయాలు చెప్తున్నాడు. ఆమధ్య ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఎంటరైన రామ్ చరణ్.. ఎందుకనో ట్విట్టర్ కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ట్విట్లర్ లో మళ్లీ ఎంటర్ కావాలని చూస్తున్నాడని అంటున్నారు. ట్విట్టర్ లో తనకో అకౌంట్ ఉందని దాని గురించి ఎవరికీ చెప్పనని.. చివరికి ఉపాసనకు కూడా తెలీదని ఓ ఇంటర్వ్యూలో ఓసారి అన్నాడు. ఇప్పుడు మాత్రం అఫిషియల్ గా ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేసేలా ఉన్నాడని అంటున్నారు.

 

 

దీనిపై అఫిషియల్ న్యూస్ రాలేదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అయింది. ఈరోజుల్లో ఈ ప్లాట్ ఫామ్ లేని సెలబ్రిటీలను ఊహించటం కష్టమే. తాము చెప్పాలనుకున్న విషయాలకు అభిప్రాయాల షేరింగ్ కు వేదికగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్ గా ఉగాది సందర్భంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఒకేసారి అకౌంట్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. మరి తండ్రి బాటలో నడుస్తాడో.. ఈ వార్త ఒట్టి పుకారులా ఉండిపోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: