చెన్నై సుందరి త్రిష ఒకసారి బిజినెస్ మెన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుని మరి పెళ్లి దాకా వెళ్లకుండానే అది క్యాన్సిల్ చేసుకుంది. అతనితో ఎందుకు త్రిష పెళ్లి ఆగిపోయిందో ఆ విషయం మాత్రం బయటకు రానివ్వలేదు. ఇదిలాఉంటే రానాతో త్రిష డేటింగ్ రూమర్స్ ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదని చెబుతుంది ఈ అమ్మడు. తనని ఎవరితో ఒకరితో లింక్ పెట్టడం మీకు అలవాటుగా మారిందని మీడియా మీద సెటైర్ వేస్తుంది త్రిష. పెళ్లి క్యాన్సిల్ తర్వాత మళ్ళీ పూర్తిస్థాయిలో సినిమాలు చేస్తూ వస్తున్నా త్రిష తమిళంలో మంచి ఫామ్ లో ఉంది. అక్కడ విజయ్ సేతుపతితో చేసిన 96 మూవీ త్రిషని మళ్ళీ స్టార్ అయ్యేలా చేసిని.

 

సినిమా కథ కథనం చాలా సింపుల్ గా ఉండటం త్రిష నటన కూడా అందుకు మ్యాచ్ అవడం చాలా బాగా అనిపించింది. త్రిష కెరియర్ 96 ముందు చప్పగా ఉన్నా ఆ సినిమా తర్వాత కోలీవుడ్ లో మళ్ళీ వరుస ఛాన్సులు అందుకుంటుంది. తమిళ స్టార్ సినిమాల్లో అవకాశాలు రాకున్నా ఫీమేల్ లీడ్ సినిమాలతో పాటుగా యువ హీరోలతో ఆమె నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా ఒకసారి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ పెళ్ళెప్పుడు అంటే అది మాత్రం ఇప్పుడప్పుడే కాదు అంటుంది చెన్నై భామ.

 

పెళ్లి విషయంలో ఈసారి తొందర పడేది లేదని.. అయితే పెళ్లి కొడుకు ఎవరైనా సరే పెళ్లి మాత్రం తనకు చాలా ఇష్టమైన లాగ్ వేగాస్ లో జరుపుకుంటా  అని అంటుంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ముందు త్రిషకు అవకాశం ఇచ్చినా కొన్ని కారణాల వల్ల అమ్మడు ఆ సినిమా నుండి తప్పించుకుందని ప్రకటించింది. ఆమె ప్లేస్ లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. చిరు ఛాన్స్ మిస్సైన త్రిష రవితేజ సరసన నటించేందుకు మాత్రం ఒకే చెప్పిందట. రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో రవితేజ, త్రిష కలిసి మరోసారి రొమాన్స్ చేయనున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరు కృష్ణ సినిమాలో కలిసి నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: