కరోనా భయాలతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అంతా స్వయం గృహ నిర్భంధంతో నిన్న అందరు తమ ఇంటికే పరిమితం కావడంతో  నిన్న ఉగాది సంబరాలు ఎక్కడ మచ్చుకునైనా కనిపించలేదు. అయితే ఈ  స్తబ్ధమైన ఈవాతావరణం నిన్న ఉదయం చిరంజీవి ట్విటర్ లో తన మొదటి పోస్ట్ చేయడంతో మెగా అభిమానుల జోష్ కు అవధులు  లేకుండాపోయింది.    


‘ఈ సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరిని కలసి కట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం ఇంటి పట్టునే ఉందాం సురక్షితంగా ఉందాం’ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారినా అందరూ ఊహించినట్లుగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం రిలీజ్ కాకపోవడంతో మెగా అభిమానులు కొంతవరకు నిరాశలోకి  వెళ్ళిపోయారు. చిరంజీవి సోషల్ మీడియా జాయిన్ అయిన తక్కువ సమయంలోనే చాలా విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్న పరిస్థితులలో  సోషల్ మీడియాలో కూడ చిరంజీవి తన సత్తా చాటాడు.   


ఇదిలా ఉంటే ఒక్క విషయంలో మాత్రం చిరంజీవి నిన్న అందరికీ షాక్ ఇచ్చాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ ను నిశితంగా పరిశీలిస్తే అక్కడ కొణిదెల చిరంజీవి ఇండియన్ యాక్టర్ అని మాత్రమే రాసాడు. ఎక్కడా  పొలిటీషియన్ అనేపదం ఎక్కడ కనిపించక పోవడంతో చిరంజీవి తన  బుర్రలోంచి రాజకీయాలను పూర్తిగా తీసిపారేసాడా అంటూ చిరంజీవి ట్విటర్ అకౌంట్ ను నిశితంగా పరిశీలించిన వారు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయాల నుండి యూటర్న్ తీసుకుని మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టిన్నప్పుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ  తనకు కేవలం సినిమాలే లోకమని అనేకసార్లు చెప్పిన విషయం తెలిసిందే.  


అయినా ఆమధ్య ‘సైరా’ విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ను కలవడంతో తిరిగి మళ్ళీ చిరంజీవి రాజకీయాలలోకి రాబోతున్నడా అంటూ ఊహా  గానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలు అన్ని చిరంజీవి దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి కాబోలు. అందుకే చిరంజీవి తన  ట్విట్టర్‌లో యాక్టర్ అనే ఒక్క మాటతో సరిపెట్టి అన్నీ అనుమానాలు క్లియర్ చేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తో కలిసి చిరంజీవి తిరిగి రాజకీయ ఎంట్రీ ఇస్తాడు అన్న ఊహాగానాలకు చిరంజీవి తన ట్విటర్ లో కేవలం యాక్టర్ అని పేర్కొనడం ద్వారా అనేక ప్రశ్నలకు ఒకే సమాధనం ఇచ్చాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: