కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా వైరస్ ని వ్యాపించకుండా ఉండేందుకు గాను తమ వంతు ప్రయత్నాలు శక్తికి మించి చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగితే అది మరింత ప్రమాదం అని భావించిన ప్రభుత్వాలు ఇందుకోసం కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలని వినకపోతే మాత్రం ఎక్కడా కూడా క్షమించ వద్దని భావిస్తున్నాయి. అయితే దీనికి కొన్ని వర్గాల నుంచి మద్దతు ప్రభుత్వాలకు రావాల్సిన అవసరం ఉందీ అనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. సినిమా వాళ్ళ నుంచి కావాలి అని కోరుతున్నారు. 

 

టాలీవుడ్ లో చాలా మంది అగ్ర హీరోలు ఉన్నారు. వీరు అందరూ కూడా తమను ఆదరించిన వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి ముందుకి రావాలని తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. ముందుకి వస్తే ప్రజలను కాపాడుకోవడం అనేది ఇంకా ఉపయోగపడుతుంది అని వాళ్ళ వంతు ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరచడమే కాకుండా ప్రజలు ఇంట్లో ఉండే విధంగా వీడియో లు తయారు చెయ్యాలని కోరుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు సరికొత్త ఉత్సాహం నింపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

 

అందరూ ముందుకి వస్తే కరోనా కట్టడి అనేది కష్టం కాదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నిధుల కొరత ఉందని కాబట్టి పేదలను ఆదుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, దీనితోనే ముందుకి వచ్చి ఆదుకోవడం మంచిది అంటున్నారు. వాళ్ళ సహకారం ఉంటే ప్రభుత్వాలకు కట్టడి చేయడం మరింత సులువు అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలను ఇప్పుడు బయటకు రానీయకుండా అందరి సహకారం తో చూస్తే ఏ ఇబ్బంది ఉండదు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు కరోనా మాత్రం ప్రజలను తీవ్రంగా భయపెడుతుంది. ప్రాణాల కోసం పోరాడుతుంది ప్రపంచం మొత్తం.

మరింత సమాచారం తెలుసుకోండి: