బొమ్మరిల్లు తర్వాత సిద్ధార్థ్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మనోడు ఇక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా అంతకుముందు వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా అతనికి తెలుగులో ఒక మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. సిద్ధార్థ్ సరసన త్రిష జంటగా నటించిన ఆ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో ఎమ్మెస్ రాజు ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్  అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా మ్యూజిక్ వల్లే సినిమా రేంజ్ పెరిగింది. యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా పాటలు బాగా ఎక్కాయి. అయితే ఇప్పుడు దాదాపు ఈ సినిమా కథను పోలిన కథతోనే మెగా హీరో మూవీ వస్తుందని తెలుస్తుంది. 

 

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. అతనే మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు డైరక్షన్ లో ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలోని రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటితో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడట. సినిమా కథ కూడా గొప్పింటి అమ్మాయి అయినా సంజనను మత్యకారుడు అయిన ఆశు ప్రేమిస్తాడట. వీళ్ళ ప్రేమ గురించి తెలుసుకున్న హీరోయిన్ తండ్రి ఆమెను ఇంట్లో బందిస్తాడట. అయినా సరే వారి ప్రేమని వాడుకోరట. అప్పుడు అశుకి ఒక ఛాలెంజ్ విసురుతాడట హీరోయిన్ తండ్రి. 

 

ఇదేదో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కథలా ఉంది కదా. అయితే అక్కడ హీరోయిన్ అన్న హీరోకి ఛాలెంజ్ విసురుతాడు ఇక్కడ హీరోయిన్ తండ్రి హీరోకి ఛాలెంజ్ చేస్తాడన్నమాట. కథ ఇదా కాదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఉప్పెన సాంగ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: