కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్ళలోకే పరిమితమై పనులేమీ లేక ఒక విధమైన నిరాశగా ఉన్న సమయంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగోని వదిలి ఒకింత ఆశలు రేపాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతుందేమో అవుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికా అన్నట్లు రాజమౌళి టైటిల్ లోగోని రివీల్ చేశాడు.

 

 

అయితే ఈ లోగోలో ఎన్టీఆర్ ని నీరుగా, రామ్ చరణ్ ని నిప్పుగా చూపించాడు. నీరు, నిప్పు కలిసి వస్తే వచ్చే కొత్త ఎనర్జీనే ఆర్.ఆర్.ఆర్ అంటూ చూపించాడు. ఈ లోగో విడుదల అయినప్పటి నుండి సాధారణ సినిమా అభిమానులు సంతోషంగా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాత్రం గొడవలు చెలరేగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ హైలైట్ అవుతాడని తారక్ అభిమానులు అంటుంటే కాదు రామ్ చరణే హైలైట్ అవుతాడని చరణ్ అభిమానులు అంటున్నారు.

 

 


మా హీరో అంటే మా హీరో అనుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. రాజమౌళి ఎన్టీఆర్ నే హైలైట్ చేస్తాడని కొందరు అంటుంటే లేదు చరణ్ నే హైలైట్ చేస్తాడని మరికొందరు అంటున్నారు. నీరు నిప్పుగా అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ని చూసి నీరే అన్నింటికంటే శక్తివంతమైనదని ఎన్టిఆర్ అభిమానులు, కాదు నిప్పే శక్తివంతమైనదని చరణ్ అభిమానులు తెగ గొడవ పడుతున్నారు.

 

 

ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి గొడవలు సహజమే అయినా, మోషన్ పోస్టర్ టైమ్ లోనే ఇలా ఉంటే ఇంకా టీజర్, ట్రైలర్  టైమ్ లో ఇది మరింత పెరగొచ్చని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి సరైన టైమ్ లోనే ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ని వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: