చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ అత్యథిక నష్టం చేసింది మాత్రం ఇటలీలోనే. ఈ వైరస్‌ కారణంగా ఇప్పుడు ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటే, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందరికీ వైధ్య సేవలు అందించే పరిస్థితి కూడా లేకపోవటంతో ప్రాణాలు పోతున్న ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. అయితే ఈ పరిస్థితిల్లో  ఓ టాలీవుడ్‌ గాయని ఇటలీలో ఇరుక్కుపోయింది.

 

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానుభావుడు, ఓం నమో వేంకటేశాయ లాంటి సినిమాల్లో సూపర్‌ హిట్ సాంగ్స్‌ పాడిన గాయని శ్వేతా పండిట్‌. తెలుగుతో పాటు హిందీలోనూ పలు పాటలు ఆలపించిన శ్వేతా ప్రస్తుతం ఇటలీలో ఉంది. దీంతో అక్కడ ఉన్న పరిస్థితులను తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్వేత పండిట్‌.

 

`ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతటి ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారత్‌లో కూడా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నారని తెలిసింది. ఇటలీలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అన్ని దేశాలకంటే ఎక్కువగా నష్టపోతున్న దేశం ఇటలీనే. ప్రతీ రోజు ఉదయం అంబులెన్స్‌ సైరెన్‌తోనే నిద్ర లేస్తున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితుల కారణంగా సురక్షింతంగా ఉన్నా` అంటూ వీడియోలో వివరించింది శ్వేతా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#staysafe #stayhome #prayforitaly #italylockdown #indialockdown #jantacurfew

A post shared by SP ✨ (@shwetapandit7) on

మరింత సమాచారం తెలుసుకోండి: