కరోనా కారణంగా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న మనకి ఒక ఆశాకిరణంలా కనిపించింది ఆర్.ఆర్.ఆర్ టైటిల్ పోస్టర్. ఉగాది పర్వదినం రోజున కూడా ఎలాంటి సినిమా అప్డేట్లు లేక జీవితంలో ఏదో మిస్సవుతున్నామన్న ఫీలింగ్ ఉన్న తరుణంలో అలాంటి ఫీలింగ్ ని తగ్గించడానికి ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగో బాగా సాయపడింది.  ఈ టైటిల్ లోగోతో రాజమౌళి అనేక అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

 

 


కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ నేపథ్యంలో బాలీవుడ్ భామ ఆలియాభట్ ఆర్.ఆర్.ఆర్ నుండి తప్పుకోనుందని వార్తలు వచ్చాయి. ఆలియా బిజీగా ఉండడంతో ఆర్.ఆర్.ఆర్ లో నటించడం కష్టమే అన్నట్లు కోకొల్లలుగా పుకార్లు చెలరేగాయి. చాలా మంది ఈ విషయాన్ని నమ్మారు కూడా. అయితే ఆర్.ఆర్.ఆర్ టీం ఈ పుకార్లని మోషన్ పోస్టర్ తోనే చెక్ పెట్టేసింది.

 

 

ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగో అనౌన్స్ మెంట్ వస్తుందని ఆలియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే కాదు మోషన్ పోస్టర్ ని అభిమానులతో పంచుకుంది. దీంతో ఆలియా సినిమా నుండి తప్పుకోలేదని క్లియర్ అయిపోయింది. ఇక మరో అనుమానం సినిమా విడుదల అనుకున్న సమయానికి అవుతుందా కాదా అన్నది. దీని గురించి పోస్టర్ లో క్లియర్ గా ఇచ్చేశాడు రాజమౌళి.

 

 

వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ రిలీజ్ డేట్ అంటూ పోస్టర్ కింద ప్రకటించేశాడు. దీంతో రిలీజ్ డేట్ పై ఉన్న అనుమానాలు కూడా తీరిపోయినట్లే. కరోనా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులకి వాడుకుని అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసి జనవరి లో సినిమా విడుదల చేయడానికే రెడీ అవుతున్నాడు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: