ఎంతో కాలం నుండి మనల్ని ఊరిస్తూ వస్తున్న ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగోని రివీల్ చేశాడు రాజమౌళి. నీరు నిప్పు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పోస్టర్ చాలా మందికి నచ్చింది. రాజమౌళి ఏది చేసినా దానిలో ఎంతో విభిన్నత ఉంటుంది. ఆ విభిన్నత ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ రూపంలో స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ ని నీరుగా, రామ్ చరణ్ ని నిప్పుగా చూపించాడు రాజమౌళి. మరి వీరిద్దరూ కలిస్తే వచ్చే ఎనర్జీ మరో రేంజ్ లో ఉంటుందని చూపించాడు.

 


అయితే ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి ఎన్నో కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టర్ ని చూసి తమకి నచ్చిన కథని ఊహించేసుకుంటున్నారు. కొమరంభీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్, అల్లూరిగా నటిస్తున్న చరణ్ చివర్లో వీరిద్దరి పాత్రలు మారిపోతాయేమో అని సందేహిస్తున్నారు. 1920 ప్రాంతంలో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారన్న సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని ఇతివృత్తంగా తీసుకునే రాజమౌళి కథ అల్లాడు. 

 

అయితే ఈ సమయంలో కొమరం భీమ్, అల్లూరి ఇద్దరూ కలుసుకున్నట్లుగా చూపించనున్నాడని అంటున్నారు. అంతే కాదు ఆ టైమ్ లో శతృవుల కళ్ళు కప్పి ఎన్టీఆర్ సీతారామరాజులా, చరన్ కొమరం భీంగా మారి ఆయా ప్రదేశాలకి వెళ్లనున్నారని కథ అల్లుతున్నారు. వీరిద్దరి మధ్య కుదిరిన దొస్తీ ఈ విధంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. రౌద్రం రుధిరం మధ్యలో రణం ఉండడంతో వీరిద్దరూ కలిసి శతృవుల మీద యుద్ధం చేయడం ఉంటుందని అనుకుంటున్నారు.

 

కేవలం ఒకే ఒక్క పోస్టర్ తో ఇన్ని కథలు పుట్టుకొస్తున్నాయి. పోస్టర్ ద్వారా సినిమాని అంచనా వేయలేకపోయినప్పటికీ ఇవన్నీ చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ మీద అంచనాలు ఏ విధంగా పెరిగాయో అర్థం అవుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ దాన్ని మించే చిత్రం ఇదే అవుతుందంటూ అభిమానులు అనుకుంటున్నారు.చూడాలి మరి ఏం అవుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: