ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు ఎంట్రీ కి ముందు నుంచే ఈ విషయంలో ఆన్‌ లైన్‌లో తెగ వైరల్ అయ్యింది. ఇక పండుగ సందర్భంగా తొలి ట్వీట్ లో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన చిరు తరువాత ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అత్యవసన పరిస్థితుల నేపథ్యంలో అభిమానులకు కొన్ని సూచనలు చేశాడు.

అయితే మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. చిరంజీవి కూడా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ఇక మీదట ట్విటర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండనున్నాడు మెగాస్టార్‌.

మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీకి అభిమానుల నుంచి కూడా సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. నిన్న దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన చిరు ఎంట్రీ విషయంపై ట్విటర్‌ లో దాదాపు లక్ష పోస్టులు రావటం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: