బ్లాక్‌ వైట్‌ కాలంగా టాప్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన లెజెండరీ నటి నిమ్మి మృతి చెందారు. వయోభారం కారణంగా చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిమ్మి 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె కోడలు మాట్లాడుతూ చాలా కాలంగా నిమ్మి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించారు. ఆమె మెమరీ కూడా లాస్‌ అయినట్టుగా వెల్లడించింది.

 

1949 నుంచి 1965 కాలంగా బర్సాత్‌, ఆన్‌, ఉడాన్‌ ఖటోల, బసంత్‌ బహార్‌, మేరే మెహబూబా, లవ్‌ అండ్ గాడ్‌ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది నిమ్మి. అలనాటి టాప్ స్టార్స్‌ దిలీప్‌ కుమార్, దేవ్‌ ఆనంద్‌, రాజ్‌ కుమార్ లాంటి టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించింది నిమ్మి. బర్సాత్ సినిమాతో బాలీవుడ్‌ వెండితెరకు పరిచయం అయిన నిమ్మి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

సినిమా ఘన విజయం సాధించటంతో ఆమె ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 1986లో రిలీజ్ అయిన లవ్ అండ్ గాడ్ ఆమె నటించిన ఆఖరి చిత్రం. తన కాలంలో ప్రముఖ రచయితగా ఉన్న అలి రజాను ఆమె వివాహం చేసుకున్నారు. అలి రజా 2007లో మరణించారు. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: